మెగాస్టార్ కెరీర్ లో మరో బ్యాడ్ ఫేజ్ ఇది!
`ఆచార్య`..`భోళా శంకర్` వైఫల్యాలతో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోన్న వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు.
`ఆచార్య`..`భోళా శంకర్` వైఫల్యాలతో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోన్న వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. పేలవమైన కంటెంట్ తో భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద తేలిపోవడంతో ఆచార్య కన్నా అన్యాయంగా ఉందని తేలిపోయింది. మెగా అభిమానులే భోళా శంకర్ విషయంలో ఎంత అసంతృప్తిగా ఉన్నారో? కామెంట్ బాక్స్ ఓపెన చేస్తే తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితి మెగాస్టార్ కి ఈ మధ్య కాలంలో ఎప్పుడూ రాలేదు. సాధారణంగా చిరంజీవిని సోషల్ మీడియాలో పెద్దగా ట్రోల్ చేయరు.
ఆయన అనుభవం..కష్టపడి ఎదిగిన వైనం చూసి ప్రత్యేకమైన గౌరవంతో వ్యవహరిస్తారు. కానీ భోళా శంకర్ తో అన్నయ్య ఇలాంటి సినిమా చేసారేంటి? అని అభిమానులు తల పట్టుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఫేజ్ ని కొన్ని దశాబ్ధాల క్రితం చిరంజీవి చూసారు. `ముఠామేస్త్రీ` తర్వాత వరుస వైఫల్యాలు ఆయన ఇమేజ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. `మెకానిక్ అల్లుడు`..`ముగ్గురు మొనగాళ్లు` లాంటి సినిమాల నుంచి `ఎస్పీ పరశురాం`..` బిగ్ బాస్` లాంటి చిత్రాలు నిర్మాతలకు ఆర్ధిక భారాన్ని మోపాయి.
`అల్లుడా మజాకా`లాంటి సినిమాలు కాస్త కోలుకున్నట్లు చేసిన ఆ తర్వాత మరికొన్ని ప్రయత్నాలు అభిమానుల్ని సంతృప్తి పరచలేదు. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకున్నారు. తదుపరి ఏ సినిమా చేసినా అది పక్కా హిట్ అవ్వాల్సిందేనని బలంగా నిర్ణయించుకున్నారు. స్ట్రెయిట్ సినిమా కంటే హిట్ సినిమాకి రీమేక్ అయితే బెటర్ అని భావించి `హిట్లర్` చిత్రాన్ని రీమేక్ చేసారు. ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. సిస్టర్ సెంటిమెంట్ మెగాస్టార్ ని సింహాసనంపై కూర్చోబెట్టింది.
అక్కడ నుంచి మళ్లీ చిరు వెనక్కి తిరిగి చూసింది లేదు. మళ్లీ 2001 లో `మృగరాజు`..`మంజునాధ` అంటూ రెండు సాహసాలు చేసి చేతులు కాల్చుకున్నారు. `డాడీ` అంచనాలు అందుకోలేకపోగా... `ఇంద్ర `ఆ లెక్కలన్నింటని సరిచేసింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అసాధారణమైన విజయాన్ని నమోదు చేసింది. చిరుకి కొత్త ఇమేజ్ ని ఈ సినిమా తీసుకొచ్చింది. మళ్లీ ఇంత కాలానికి చిరు బ్యాడ్ ఫేజ్ని పేస్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి నుంచి చిరంజీవిని ఎవరు బయట పడేస్తారో చూడాలి.