పిక్ టాక్ ; హాట్ అందాలతో జూ. మిల్కీ బ్యూటీ కవ్వింపులు

నాని సినిమా కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమా తో తెలుగు ప్రేక్షకులు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌.

Update: 2023-11-20 06:42 GMT

నాని సినిమా కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమా తో తెలుగు ప్రేక్షకులు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌. ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభంలో జూనియర్ మిల్కీ బ్యూటీ అంటూ ప్రశంసలు దక్కించుకుంది. ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ అందానికి ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడి అందం ఉందని, అదృష్టం కలిసి వస్తే కచ్చితంగా స్టార్‌ హీరోయిన్‌ అవ్వడం ఖాయం అన్నారు.


మెహ్రీన్‌ అందంగా ఉండటంతో మంచి ఆఫర్లు లభించాయి. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో మెజార్టీ సినిమాలు నిరాశ పరిచాయి. దాంతో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. అదే సమయంలో పెళ్లికి రెడీ అయ్యి నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే ఆ నిశ్చితార్థం బ్రేక్ అయినా కూడా మెహ్రీన్ కి మునుపటి మాదిరిగా ఆఫర్లు మాత్రం రావడం లేదు.


సినిమాల్లో ఛాన్స్ రాకున్నా కూడా తన అందంతో ఎలాంటి ఛాన్స్ ను వదులుకోవడం లేదు. అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో మళ్లీ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇలాంటి హాట్ ఫోటోలు మరియు వీడియో లను షేర్ చేస్తోంది.


తాజాగా షేర్ చేసిన ఫోటో ల్లో ఈ ఫోటో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. కాస్త ముందుకు వంగి మరీ మెహ్రీన్ తన అందాలను చూపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంత అందంగా ఉన్న మెహ్రీన్‌ కి కచ్చితంగా స్టార్‌ హీరోల తో నటించేంతగా ఆఫర్లు రావాలి.. కానీ ఆమె కి అదృష్టం కలిసి రావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆమె వయసు ఏమీ మించి పోలేదు, ఆమె ను జనాలు తిరష్కరించలేదు. కనుక మళ్లీ కూడా మెహ్రీన్‌ బిజీ అయ్యేందుకు అవకాశాలు లేకపోలేదు అంటూ సినీ విశ్లేషకులు ఈ ఫోటోలు చూసిన తర్వాత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News