మిరాయ్.. ఇదేం మ్యాజిక్ సజ్జా!
గతేడాది రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్‌లోనే ఇది సాధారణ సినిమా కాదన్న ముద్ర పడిపోయింది.;

తెలుగు సినిమాల్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాల్లా మారిపోతున్న ట్రెండ్‌కు తాజా ఉదాహరణగా నిలుస్తోంది 'మిరాయ్'. తేజా సజ్జా హీరోగా వస్తున్న ఈ సూపర్ యోధ కథపై, అఫిషియల్ టీజర్ రాకముందే ఓ మోస్తరు బజ్ కలగడమేకాదు, బుక్ మై షో లో 25 వేల మందికి పైగా ఇంటరెస్ట్ చూపించడం సినీ పరిశ్రమను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ప్రమోషన్లు లేకుండా వచ్చిన ప్రీ రిలీజ్ హైప్ అనడం అతిశయోక్తి కాదు.
ఈరోజుల్లో పెద్ద హీరోల సినిమాలు సైతం రిలీజ్ తేదీ దగ్గర పడినా ఆసక్తిని రేపలేక పోతున్న తరుణంలో, ఓ చిన్న హీరో చేస్తున్న సినిమా ఇలా దూసుకుపోతుండటం వెనుక ఓ స్ట్రాంగ్ కాన్సెప్ట్, మంచి టైటిల్, అలాగే సైలెంట్ కానీ మార్మోగేలా డిజైన్ చేసిన ప్రెజెంటేషన్ ఉంది. గతేడాది రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్‌లోనే ఇది సాధారణ సినిమా కాదన్న ముద్ర పడిపోయింది. అంతే కాదు, అప్పటి నుంచే ‘ఇది వేరే లెవెల్ మూవీ అయిపోతుంది’ అన్న నమ్మకం మొదలైంది.
తేజా సజ్జా క్రేజ్ కు మరొక ముఖ్య కారణం ‘హనుమాన్’. ఆ సినిమా తో అతను పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పుడు ఆ రూట్లోనే మిరాయ్ కూడా సైలెంట్ గానే తన మార్క్ ను చూపెడుతోంది. తక్కువ ఖర్చుతో, అధిక నమ్మకంతో చేసిన సినిమా ఎలా హైప్ క్రియేట్ చేయాలో చూపించిన ‘హనుమాన్’ తరహా హిట్, మళ్లీ రిపీట్ కావొచ్చన్న టాక్ ఇండస్ట్రీలో స్పష్టంగా వినిపిస్తోంది.
సినిమాలో ఏ పాత్రలు ఎలా ఉంటాయో అధికారికంగా బయటకు రాకపోయినా, ‘సూపర్ యోధ’ కాన్సెప్ట్ చుట్టూ మలచిన ప్రెజెంటేషన్ ఒక అడుగు ముందే ఉంది. సాధారణ సూపర్ హీరోలతో పోల్చుకుంటే మిరాయ్ ఓ ప్రాచీన భావనతో మిక్స్ చేసిన కథగా వుంటుందనే ఊహలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి తోడు, తేజా ఎంచుకుంటున్న స్క్రిప్ట్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉండటం వల్ల ప్రేక్షకుల్లో ఈ ఫిల్మ్ పై ఒక ఆసక్తి పెరుగుతోంది.
ఇక మిరాయ్ 2025లో బాక్సాఫీస్ వద్ద సైలెంట్ గానే వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ‘ద రాజాసాబ్’, ‘వార్ 2’ లాంటి పెద్ద సినిమాల మధ్య ఓ చిన్న హీరో సినిమా ఇలా తన స్థానం సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. ఇది ఇండస్ట్రీలో కథల ఆధారిత విజయాలకు మార్గం చూపించగల శుభ సంకేతంగా కూడా చెప్పొచ్చు. అయితే టీజర్ విడుదలయ్యాక ఈ హైప్ నిలబడుతుందా? పెరుగుతుందా అనేది మరో కీలకం విషయం. మరి తేజా సజ్జా కష్టానికి అదృష్టం ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.