అన్నా ఇక చాలు.. ఎన్టీఆర్‌ మంచితనం గురించి రౌడీస్టార్‌

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం 'కింగ్డమ్‌' చివరి దశ వర్క్‌తో బిజీగా ఉన్నాడు.;

Update: 2025-03-29 05:58 GMT
Vijay Deverakonda on NTR’s Generosity

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం 'కింగ్డమ్‌' చివరి దశ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అయినా కూడా ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్ 2025లో టాలీవుడ్‌ నుంచి విజయ్ దేవరకొండ హాజరు అయ్యాడు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలను గురించి మాట్లాడారు. ముఖ్యంగా బాలీవుడ్‌ సినిమాలతో పోల్చితే ఈమధ్య కాలంలో సౌత్‌ ఇండియన్ సినిమాల మార్కెట్‌ విస్తరించడంతో పాటు, హిందీ సినిమాలపై ఓటీటీ ప్రభావం, టాలీవుడ్‌తో పాటు ఇతర సౌత్ ఇండియన్ సినిమాల బడ్జెట్‌ ఇలా అన్ని విషయాల గురించి విజయ్ దేవరకొండ తనకు అవగాహన ఉన్నంత వరకు మాట్లాడాడు. విజయ్ దేవరకొండ సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

విజయ్‌ దేవరకొండ తన తాజా చిత్రం 'కింగ్డమ్‌' గురించి కూడా వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అంతే కాకుండా తన సినిమా టీజర్‌కి ఎన్టీఆర్‌ వాయిస్ ఓవర్‌ ఇవ్వడంపైనా స్పందించాడు. ఎన్టీఆర్‌ వాయిస్ ఓవర్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... మేము టీజర్‌ను కట్‌ చేసిన సమయంలో, టీజర్‌కి వాయిస్ ఓవర్‌ రాసుకున్న సమయంలోనే దీనికి ఎన్టీఆర్‌ అయితేనే న్యాయం చేస్తారని భావించాం. అప్పుడే తారక్‌ అన్న వాయిస్ దీనికి కావాల్సిందే అని నిర్ణయించుకున్నాం. ఈ టీజర్‌కి ఆయన వాయిస్ కాకుండా మరెవ్వరి వాయిస్ న్యాయం చేయలేదు అనుకున్నాం. మేము వెళ్లి అడిగిన సమయంలో కొద్ది సమయం మాట్లాడి ఈ సాయంత్రం చేసేద్దాం అన్నారు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెన్నైలో ఉన్నాడు, మ్యూజిక్‌ వర్క్‌తో అక్కడ ఉన్నాడు అన్నాను. దర్శకుడు ఉండాలని అనుకున్నాను. కానీ తారక్‌ అన్న మనం ఇద్దరం కలిసి చేసేద్దాం అన్నారు. నేను డబ్బింగ్‌ స్టూడియోకి వెళ్లేప్పటికి అక్కడ ఉన్నారు. అప్పటికే ఆయన డబ్బింగ్‌కి సిద్ధం అవుతున్నారు. టీజర్ చూసిన తర్వాత చాలా ఎగ్జైట్‌ అయ్యారు. చాలా ఆసక్తిగా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఆయన ఇంకో టేక్‌.. ఇంకో టేక్‌ అని చాలా సార్లు డబ్బింగ్‌ చెప్పారు. చివరకు అన్నా ఇక చాలు అని నేను చెప్పేంత వరకు ఆయన బెస్ట్‌.. ది బెస్ట్‌ ఇచ్చేందుకు మళ్లీ మళ్లీ ఇస్తూనే ఉన్నారు. అంతకు మించి చేయాల్సిన అవసరం లేదన్నా అనేంత వరకు ఆయన చెబుతూనే ఉన్నారు. టీజర్‌కి ఆయన ఇచ్చిన వాయిస్‌ బాగా పని చేసిందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

నేను మొదటి సారి అయన్ను ఒక విషయం అడగడం, ఆయన ఓకే చెప్పడం చాలా స్పెషల్‌గా అనిపించింది. చాలా సంతోషం అనిపించిందని రౌడీ స్టార్‌ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ మంచితనం గురించి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చెప్పిన ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్టీఆర్‌ మంచి మనసు గురించి గతంలోనూ పలువురు హీరోలు మాట్లాడిన విషయం తెల్సిందే. ఎంత పెద్ద స్టార్‌ అయినా సింప్లీ సూపర్‌ అని తారక్‌ ఎంతో మందితో అభినందనలు పొందిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ జాబితాలో విజయ్ దేవరకొండ చేశారు.

తన సినిమాల షూటింగ్స్‌తో, ఇతర వర్క్‌తో బిజీగా ఉన్నా తన అవసరం ఉందంటే కచ్చితంగా ఇతర హీరోల సినిమాల కోసం ఎన్టీఆర్‌ కచ్చితంగా ముందు ఉంటారు. ఆ సినిమాలను ప్రమోట్‌ చేస్తాడని మరోసారి నిరూపితం అయింది. దేవర సినిమా ప్రమోషన్‌ కోసం ఎన్టీఆర్‌ జపాన్ వెళ్లి వచ్చాడు. త్వరలో ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌కి జాయిన్‌ కాబోతున్నాడు. మరో వైపు వార్‌ 2 తో ఈ ఏడాదిలోనే ఎన్టీఆర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవర 2 సినిమాను సైతం ఈ ఏడాదిలో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ ఇతర హీరోల సినిమాల ప్రమోషన్స్‌లోనూ తనవంతు సహకారం అందిస్తూ మంచితనం కనబర్చుతూ ఉంటాడు.

Tags:    

Similar News