వారందరికీ వార్నింగ్... మోహన్ బాబు సంచలన లేఖ!
ప్రస్తుతం తనకు ఏ రాజకీయ పార్టీతోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ.. స్నేహం కానీ, శత్రుత్వం కానీ లేవని చెప్పే
ప్రస్తుతం తనకు ఏ రాజకీయ పార్టీతోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ.. స్నేహం కానీ, శత్రుత్వం కానీ లేవని చెప్పే.. నటుడు, నిర్మాత, విద్యావేత్త, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు.. తాజాగా ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా తన పేరును చాలా మంది వాడేసుకుంటున్నారని, దయచేసి ఏ పార్టీ వారు తనపేరును రాజకీయంగా వాడుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
అవును... ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ.. డూ ఆర్ డై అన్నట్లుగా ప్రచారాలు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా తీవ్ర కృషి చేస్తున్నాయి.. అందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన పేరును రాజకీయాల్లో వాడుకుంటున్నారంటూ మోహన్ బాబు ఒక లేఖ విడుదల చేశారు.
ఇందులో భాగంగా... ఈ మధ్యకాలంలో తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చింది అని మొదలుపెట్టిన మోహన్ బాబు... దయచేసి ఏ పార్టీవారైనా తన పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ఇక మనమంతా అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని అన్నారు.
అనంతరం... చేతనైతే నలుగురికి సాయపడటంలోనే దృష్టిపెట్టాలి కానీ, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమని తెలిపారు. ఈ సందర్భంగా "ఎక్స్" వేదికగా ఈ విషయాలని వెల్లడిస్తూ లేఖ విడుదల చేశారు మోహన్ బాబు. ఈ క్రమంలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా కన్ క్లూజన్ ఇచ్చారు.
ఇందులో భాగంగా.. "నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్దులై ఉందామని కోరుకుంటూ.. ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ"... ధన్యవాదాలతో ముగించారు మోహన్ బాబు! దీంతో... ఈ లేఖ ఎవరిని ఉద్దేశించి రాసారంటూ నెట్టింట సందడి మొదలైంది.
కాగా... గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్ బాబు, 2019 ఎన్నికల సమయలో వైసీపీకి సపోర్ట్ చేశారు! ఈ క్రమంలో ఇటీవల బీజేపీ పెద్దలతో మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు దగ్గరగా ఉంటున్నారనే కథనాల నేపథ్యలో.. వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి!! ఈ క్రమంలో... తన పేరు రాజకీయాల్లో వాడుకోవద్దంటూ మోహన్ బాబు విజ్ఞప్తితో కూడిన హెచ్చరికలు జారీచేశారు.