సూపర్‌ స్టార్‌ సినిమా.. రాజుకున్న హిందుత్వ వివాదం

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను పంపిణీ చేయడం ద్వారా అంచనాలు భారీగా పెరిగాయి.;

Update: 2025-03-28 13:37 GMT
Mohanlal faces political controversy

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ముఖ్య పాత్రలో నటించి దర్శకత్వం వహించిన 'ఎల్‌ 2 : ఎంపురన్‌' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. కేరళ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ వీకెండ్‌లో సినిమా భారీగా వసూళ్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కేరళలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఆయా భాషల్లో విడుదల అయింది. తెలుగులో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను పంపిణీ చేయడం ద్వారా అంచనాలు భారీగా పెరిగాయి. అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా రూ.కోటి దక్కించుకున్నట్లు యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

ఎల్‌ 2 సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్‌తో నడుస్తున్న సమయంలో కొందరు హిందుత్వ వాదులు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ తనకు హిందువలపై ఉన్న కోపంను, ద్వేశంను ఈ సినిమాలోని అభిమన్యు సింగ్‌ పాత్ర ద్వారా చూపించాడు అంటూ కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేరళలో ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నార్త్‌ ఇండియాలో ఈ సినిమాను నిషేదించాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తూ ఉంటే, కొందరు మాత్రం ఈ సినిమాలోని అభిమన్యు సింగ్‌ పాత్రను హిందుత్వ ఉగ్రవాదిగా చూపించినందుకు గాను వెంటనే పృథ్వీరాజ్ సుకుమారన్‌ క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎల్‌ 2 సినిమాలో అభిమన్యు సింగ్‌ను మొదట గుజరాత్‌లోని ఒక అల్లర్లలో ముస్లీంలకు వ్యతిరేకంగా చూపించిన దర్శకుడు ఆ తర్వాత కరడు గట్టిన హిందుత్వ వాదిగా మారి జాతీయ స్థాయి రాజకీయ నాయకుడిగా ఎలా మారుడు అనేది చూపించే ప్రయత్నం చేశాడు. ఇది ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని కించ పరిచే విధంగా ఉందని, ఒక ప్రముఖ పార్టీని సైతం టార్గెట్‌ చేసే విధంగా ఉందంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన వారే ఎల్‌ 2 పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడిని విలన్‌గా చూపించారంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారానే నేరుగా బాహాటంగా విమర్శలు చేస్తున్నారు.

అభిమన్యు సింగ్‌ పాత్ర విషయంలో వస్తున్న విమర్శలపై ఇప్పటి వరకు దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లేదా హీరో మోహన్‌ లాల్‌ స్పందించలేదు. ఈ విషయంలో ఎంత సైలెంట్‌గా ఉంటే అంత బెటర్‌ అనే అభిప్రాయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. మరో వారం పది రోజుల్లో సినిమా రన్‌ పూర్తి అయితే ఆ తర్వాత అడిగే వారు ఉండరు అనేది వారి అభిప్రాయం కావచ్చు. కనుక ఈ కొన్ని రోజుల పాటు వారు ఎవరు ఏమన్నా కూడా పెద్దగా స్పందించక పోవడం మంచిది అనే అభిప్రాయంను వ్యక్తం అవుతోంది. ఈమధ్య కాలంలో సినిమాలకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిన సమయంలో ఇలాంటి విమర్శలు, వివాదాలు కామన్‌ అని కొందరు లైట్ తీసుకోవాలి అంటున్నారు. కానీ రాజకీయ వివాదం కావడంతో ఎక్కడి వరకు దారి తీస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News