యువ నాయికలతో 100 ఏజ్‌లో.. సమస్యే కాదన్న స్టార్ హీరో!
సీనియర్ హీరోల సరసన నిండా పాతిక అయినా లేని కథానాయికలు నటించడాన్ని ఒక సెక్షన్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది.
60 ప్లస్ హీరోల సరసన 30 మైనస్ హీరోయిన్లు నటించడం రెగ్యులర్ గా చూస్తున్నదే. 50 ప్లస్ వయసులో ఉన్న ఏఎన్నార్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సరసన 30 వయసు కథానాయికలు నటించారు. తన వయసులో సగం ఉన్న శ్రీదేవితో ఏఎన్నార్ నటిస్తుంటే ప్రజలు చాలా గుసగుసలాడుకున్నారు. ఏఎన్నార్ తో నటించిన శ్రీదేవి ఆ తర్వాత ఆయన వారసుడు నాగార్జున సరసన నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల పరిశ్రమలోని 60 ప్లస్ అగ్ర హీరోల సరసన 30 వయసు కథానాయికలు నటిస్తున్నారు. ఇది ఒక రెగ్యులర్ సైకిల్.
సీనియర్ హీరోల సరసన నిండా పాతిక అయినా లేని కథానాయికలు నటించడాన్ని ఒక సెక్షన్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. సోషల్ మీడియాల్లో దీనిపై విమర్శిస్తూనే ఉన్నారు. దీనిపై ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పందించారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో యువ నటీమణులతో రొమాన్స్ చేస్తున్న సీనియర్ హీరోల మనోగతం గురించి మాట్లాడారు. ``ఇక్కడ వయస్సు కంటే నమ్మకం, ప్రేక్షకుల ఆదరణ ముఖ్యమ``ని లాల్ అన్నారు.
ఈ సైకిల్ ఇప్పుడే ప్రారంభం కాలేదని వ్యాఖ్యానించారు. ఆరోగ్యంగా ఉంటేనే 100 ఏళ్ల వయసులోను నటించొచ్చు. వయసుతో సమస్యేమీ లేదు. మీరు ఎంచుకున్న పాత్ర ఎలాంటిది? అనేది చూడాలి. అది అసౌకర్యంగా అనిపిస్తే దానిని తిరస్కరించాలని అన్నారు. నటనకు వయసుతో సంబంధం లేదని మోహన్‌లాల్ అన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న మోహన్‌లాల్ `బరోజ్` అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
మలయాళ చిత్ర పరిశ్రమపై ప్రశ్నలకు లాల్ స్పందిస్తూ... పరిశ్రమ సాంకేతికంగా చాలా ఎదిగిందని మోహన్ లాల్ అన్నారు. టెక్నీషియన్లు గొప్ప పనులు చేయడానికి సాంకేతికత వీలు కల్పిస్తుందని వ్యాఖ్యానించారు . కెరీర్ మ్యాటర్ కి వస్తే... స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బరోజ్ లో మోహన్‌లాల్ టైటిల్ పాత్రను పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిరాశపరిచింది. లాల్ తదుపరి సినిమాపై ఫోకస్ చేయనున్నారు.