వారసుడు వచ్చేశాడు.. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ అదుర్స్..!

మోక్షజ్ఞ స్టైలిష్ లుక్ నందమూరి ఫ్యాన్స్ కి ఫెస్టివల్ వైబ్ తెచ్చింది.

Update: 2024-09-06 05:54 GMT

నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై ఈమధ్య దర్శకుడు ప్రశాంత్ వర్మ సింబా వస్తున్నాడంటూ హింట్ ఇవ్వగా నేడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రకటించడంతో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. మోక్షజ్ఞ స్టైలిష్ లుక్ నందమూరి ఫ్యాన్స్ కి ఫెస్టివల్ వైబ్ తెచ్చింది.


బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం ఎన్నో ఏళ్లుగా నందమూరి ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ తన మీద పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా తన మొదటి సినిమా ఉండాలని మోక్షజ్ఞ కొన్నాళ్లు నటనా శిక్షణ తీసుకున్నాడు. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటన్నది చూపించడానికి రెడీ అయ్యాడు మోక్షజ్ఞ. అ! తో దర్శకుడిగా పరిచయమై ప్రతి సినిమాను నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ అందుకుంటున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మోక్షజ్ఞ మొదటి సినిమా వస్తుంది.

ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తేజశ్విని ఈ సినిమాకు సమర్పురాలిగా వ్యవహరిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

మోక్షజ్ఞ తొలి సినిమా అనౌన్స్ మెంట్ చేస్తూ ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మోక్షజ్ఞని పరిచయం చేయడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నా.. నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు బాలకృష్ణ గారికి థాంక్స్. పురాణాలు ఇతిహాస కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ఇది అవుతుందని అన్నారు ప్రశాంత్ వర్మ.

మోక్షజ్ఞని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు బాలకృష్ణ గారికి థాంక్స్. ఎస్.ఎల్.వి సినిమాస్ కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చ్యునిటీ అని అన్నారు. ప్రశాంత్ వర్మ ఒక అద్భుతమైన కథతో వస్తున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ సినిమా కోసం మేమంతా చాలా ఆసక్తిగా ఉన్నామని మిగతా డీటైల్స్ త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి.

Tags:    

Similar News