చిన్న సినిమాల‌కు ఈ ఫార్మాట్ క‌లిసొస్తుందా?

రూ.99 కే టికెట్ ధ‌ర‌ను నిర్ణ‌యించ‌డం జాన్వీ-రాజ్ కుమార్ రావుల స్పోర్ట్స్ డ్రామా `మిస్టర్ అండ్ మిసెస్ మహి`కి క‌లిసొచ్చింది

Update: 2024-05-31 06:00 GMT

రూ.99 కే టికెట్ ధ‌ర‌ను నిర్ణ‌యించ‌డం జాన్వీ-రాజ్ కుమార్ రావుల స్పోర్ట్స్ డ్రామా `మిస్టర్ అండ్ మిసెస్ మహి`కి క‌లిసొచ్చింది. అడ్వాన్స్ టిక్కెట్ సేల్‌లో ఈ చిత్రం దుమ్ము లేపింది. ఈ సినిమా గ‌ద‌ర్ 2, ఆదిపురుష్, డంకీ లాంటి చిత్రాల‌తో పోటీప‌డుతోంది. ఇది ఒక చిన్న సినిమాకి పెద్ద మేల్కొలుపు ప్ర‌య‌త్నం అని చెప్పాలి. ప‌రిమిత బ‌డ్జెట్ తో రూపొందించిన ప్ర‌యోగాత్మ‌క క్రీడా నేప‌థ్య చిత్రాల‌కు ఇది ఒక మోడ‌ల్ బిజినెస్ అని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే 99 కే టికెట్ ఆఫ‌ర్ కొద్దిరోజులు మాత్ర‌మే. తిరిగి టికెట్ ధ‌ర‌ను నార్మ‌ల్ గా మారేప్ప‌టికి ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది వేచి చూడాల్సి ఉంది.

జాన్వీ న‌టించిన మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి ఆరంగేట్రం అదిరిపోయింద‌నేది టాక్. దీనికి కార‌ణం దేశంలోని అన్ని మ‌ల్టీప్లెక్స్ చెయిన్స్ లో టికెట్ సేల్ ఆద‌ర్శంగా నిలుస్తోంది. మొదటి రోజు 2,05,000 టిక్కెట్‌లను విక్రయించింది. ఒక చిన్న సినిమాకి ఈ రేంజు స్పంద‌న ఊహించ‌నిది. 2024లో ఇప్పటివరకు ఏ సినిమాకైనా అత్యధిక టిక్కెట్ అమ్మకాలను నమోదు చేసింద‌ని ట్రేడ్ చెబుతోంది. హృతిక్ రోషన్ ఫైటర్ -1,45,000 .. ఆర్టికల్ 370- 1,25,000 వంటి భారీ విడుదలలను జాన్వీ సినిమా అధిగమించింది. మొదటి రోజు 1,60,000 టిక్కెట్ల అమ్మకాల‌ను సాధించిన గుంటూరు కారం రికార్డును `మిస్టర్ అండ్ మిసెస్ మహి` అధిగమించడం ఆశ్చ‌ర్య‌క‌రం. ఈ చిత్రం మొత్తం 2.15 ల‌క్ష‌ల‌ అడ్వాన్స్ టిక్కెట్ అమ్మకాలను చేరుకోవచ్చని అంచనా.

2023-24 హిందీ చిత్రాల అడ్వాన్స్ టికెట్ సేల్ వివ‌రాలు ప‌రిశీలిస్తే... 1. పఠాన్ (హిందీ) - 5,45,000 2. జవాన్ (హిందీ) - 5,31,000 3. యానిమ‌ల్ (హిందీ) - 4,28,000 4. టైగర్ 3 (హిందీ) - 3,07,000 5. గదర్ 2 - 2,006,81 . ఆదిపురుష్ (హిందీ) - 2,78,000 7. డంకీ - 2,31,000 8. మిస్టర్ అండ్ మిసెస్ మహి - 2,10,000 (అంచనా) 9. ఫైటర్ - 1,44,000.. 10. ఆర్టికల్ 370 - 1,21,00 టాప్ 10 జాబితాలో ఉన్నాయి. అద్భుత‌మైన ఓపెనింగులు సాధించిన మిస్ట‌ర్ అండ్ మిసెస్ మాహి చిత్రం మంచి రికార్డుల‌ను సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. క్రికెట్ ని ప్రేమించే భార్యా భ‌ర్త‌ల క‌థ‌తో ఈ సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలుస్తోంది. డాక్ట‌ర్ మాహి త‌న భ‌ర్త ప్రోద్బ‌లంతో క్రికెట‌ర్ గా మారుతుంది. ఆ త‌రవాత స‌న్నివేశం ఏంట‌నేది తెర‌పై చూడాలి. ప‌రిమిత బ‌డ్జెట్ల‌తో రూపొందే చిన్న సినిమాల‌కు టికెట్ ధ‌ర త‌గ్గింపుతో భారీ ఓపెనింగులు సాధించే వ్యూహం అనుస‌ర‌ణీయ‌మ‌ని జాన్వీ మూవీ నిరూపిస్తోంది. సినిమాలో కంటెంట్ బావుంటే మౌత్ టాక్ ద్వారా పెద్ద విజ‌యం సాధించాల‌నేది ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ వ్యూహం కావొచ్చు. మ‌రి కాసేస‌ట్లో మిస్ట‌ర్ అండ్ మిసెస్ మాహి రివ్యూలు అందుబాటులోకి రానున్నాయి.

Tags:    

Similar News