ఆ భూకంపం తర్వాత మృణాల్ ఇంట్లోనూ భూకంపమే!
నేచురల్ స్టార్ నాని..మృణాల్ ఠాకూర్ నటించిన ఏమోషనల్ ఎంటర్ టైనర్ `హాయ్ నాన్న` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని..మృణాల్ ఠాకూర్ నటించిన ఏమోషనల్ ఎంటర్ టైనర్ `హాయ్ నాన్న` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తండ్రి-కుమార్తెల రిలేషన్ షిప్...భార్యాభర్తల మధ్య రిలేషన్ షిప్ ని హైలైట్ చేస్తూ తెరకెక్కించిన సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. నాని..మృణాల్ ఎవరి పాత్రల్లో వారు అభినయించిన తీరు మంచి పేరు తీసుకొచ్చింది. తండ్రిగా నాని....తల్లిగా మృణాల్ నటన పరంగా ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి నటించారు.
అందులో పాప పాత్రని ఎంత గొప్పగా హైలైట్ చేసారో తెలిసిందే. పాప చుట్టూ తిరిగే ఆ కథకి అంతా కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఎదురైన అనుభవాన్ని మృణాల్ ఠాకూర్ గుర్తు చేసుకుంది. సినిమాలో ఆసుపత్రి సన్నివేశంకి సంబంధించిన షూట్ లో మృణాల్ ఏమోషనల్ గా..వ్యక్తిగతంగా ఎంతగా కనెక్ట్ అయిందో చెప్పుకొచ్చింది. సరిగ్గా ఆ సన్నివేశం చిత్రీకరించే ముందు మృణాల్ ఓవీడయో చూసిందిట.
దీంతో ఆ సన్నివేశంలో మరింత ఒదిగిపోయి నటించినట్లు తెలిపింది. `చిత్రీకరణకు కొద్దిసేపటి ముందు భూకంపం కారణంగా తల్లి తన బిడ్డను కోల్పోయిన హృదయ విదారక ఓ వీడియోను చూసాను. అది నన్ను ఎంతో బావోద్వేగానికి గురి చేసింది. ఆ వీడియో ఇప్పటికీ నా కళ్ల ముందు ఆడుతూనే ఉంది. క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. అలాంటి సమయంలో బాధితులు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోతారో ఊహించగలను.
మనిషిని మానసికంగా చంపేసే దృశ్యాలేవి. ప్రకృతి వైపరిత్యంగా కారణంగా మృతి చెందితే ఎవర్నీ బాధ్యుల్ని చేయగలం. ఎవర్నీ ప్రశ్నించగలం. ఆ సన్నివేశం నా హృదయాన్ని ఎంతో బలంగా తాకింది.ఆ వీడియో చూసిన తర్వాత నా సినిమాలో ఎమోషనల్ సీన్ లో మరింతగా ఒదిగిపోయాను. కానీ బిడ్డలు దూరమైతే ఆ తల్లిదండ్రులకు తీరని శోకంగానే ఉంటుంది` అని అంది.