మృణాల్ ఠాకూర్ వయసు ఎంతో తెలుసా..
సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే విశేషమైన అభిమానులని సైతం సొంతం చేసుకుంది. సీతారామంలో మృణాల్ ని చూసిన ప్రేక్షకులు ఆమె అందాన్ని, రూపాన్ని మనసులో ముద్రించేసుకున్నారు.
అయితే సినిమాలో క్యారెక్టర్ కి తగ్గట్లు ట్రెడిషనల్ గా కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం అల్ట్రా మోడరన్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే ఎలాంటి క్యారెక్టర్ లోకి అయిన పరకాయ ప్రవేశం చేసేసి ఆ పాత్రకి ప్రాణం పోస్తూ ఉంటుంది. క్షణాల్లో పాత్రని అర్ధం చేసుకొని అందులోకి తనని తాను మార్చుకునే కెపాసిటీ మృణాల్ సొంతం.
అందుకే ఇటు తెలుగు, అటు హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తెలుగులో ఆమె రెండో సినిమాగా హాయ్ నాన్న డిసెంబర్ 7న రాబోతోంది. నేచురల్ స్టార్ నానికి జోడీగా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ నటించడం విశేషం. ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ లో భాగంగా నాని, మృణాల్ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా మృణాల్ కెమెరా కోసమే ప్రత్యేకంగా తయారుచేయబడిన ఎక్స్ ఫ్యాక్టర్ అంటూ నాని కితాబు ఇచ్చేశారు. ఇద్దరం కలిసి నటిస్తున్నప్పుడు చాలా నార్మల్ గా అనిపిస్తోంది. అదే సీన్ ని మోనిటర్ లో చూస్తున్నప్పుడు మాత్రం మృణాల్ ట్రాన్స్ ఫర్మేషన్ చాలా అద్భుతంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ తన ఏజ్ ని కూడా రివీల్ చేసేసింది. తన వయస్సు 31 అంటూ ఓ ప్రశ్నకి సమాధానం చెప్పింది. డెంటల్ డాక్టర్ గా కొంతకాలం చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని మృణాల్ తెలిపింది. తన మొదటి సినిమా మరాఠీలో చేసానని చెప్పుకొచ్చింది. అలాగే తన హైట్ 5.7 అడుగులు అని క్లారిటీ ఇచ్చింది. తనకి తెలుగు భాష అర్ధమవుతుందని, తెలుగులో డైలాగ్స్ త్వరలో చెప్పుకుంటానంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక నాని కూడా పెళ్ళికి ముంది అంజనాతో ఆరేళ్ళ పాటు లవ్ స్టొరీ నడిచిందని, నటుడు అయ్యాక తాను కొన్న ఫస్ట్ కారు హోండా సిటీ అని ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.