మృణాల్ .. డిజైనర్ లుక్ మైండ్ బ్లాక్
రంగుల ప్రపంచంలో కెరీర్ కావాలనుకుంటే ఔత్సాహిక తారలు ఎలా ఉండాలో నిన్ననే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మృణాల్ ఠాకూర్
రంగుల ప్రపంచంలో కెరీర్ కావాలనుకుంటే ఔత్సాహిక తారలు ఎలా ఉండాలో నిన్ననే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మృణాల్ ఠాకూర్. ఇక్కడ ముద్దు పెట్టుకోవడానికి లేదా ఘాటైన సన్నివేశాల్లో నటించడానికి వెనకాడితే అవకాశాలు రావని కూడా చెప్పింది. ఈ విషయంలో తన పేరెంట్ ని ఒప్పించేందుకు చాలా ప్రయాసలు పడ్డానని, చివరికి ట్రాక్ లోకి వచ్చారని కూడా వెల్లడించింది.
ముద్దు సన్నివేశాలకు నో చెప్పడం వల్లనే తాను చాలా అవకాశాలు కోల్పోయానని మృణాల్ వెల్లడించింది. ఈ రంగంలో రాణించాలంటే పట్టు విడుపు ఉండాలని చెప్పింది. అంతేకాదు.. ఇటీవల తనలోని ఫ్లెక్సిబిలిటీ సోషల్ మీడియాల్లో బహిర్గతమవుతూనే ఉంది. ఫోటోషూట్ల పరంగాను తనలోని పట్టు విడుపు బయటపడింది. మునుపటితో పోలిస్తే మృణాల్ లోని హాట్ కంటెంట్ ఎలివేషన్ అమాంతం పెరిగిందని అభిమానులు గ్రహిస్తున్నారు.
గతం గతః.. వర్తమానంలో పోటీ ప్రపంచంలో ఎలా ఉండాలో మృణాల్ ని చూసి నేర్చుకోవాలి. ఈ బ్యూటీ గతంలో కంటే హాట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా సిల్వర్ కలర్ బ్లౌజ్.. సిల్వర్ గోల్డ్ మిశ్రమ కాంతితో రూపొందించిన ప్రత్యేక చీరలో తళతళా మెరిసిపోతున్న ఫోటోలను షేర్ చేసింది. మృణాల్ ఈ ప్రత్యేకమైన డిజైనర్ శారీ లుక్ లో ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. మిలమిలా మెరుస్తున్న ఆ అందమైన కళ్లు... చెవులకు ఎంపిక చేసిన డ్రెస్ తో పాటుగా కాంబినేషన్ జూకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
``ఉఫ్.. మృణాల్ ఖచ్చితంగా అందరికంటే అందంగా ఉంటారు.. కైసా లాగా యే లుక్?`` అంటూ ఈ ఫోటోషూట్ చేసిన వ్యక్తి సరదాగా వ్యాఖ్యానించారు.అమీర్ అసఖ్రానీ మృణాల్ ని ఇలా కెమెరాలో బంధించారు. దీనికి ఒక అభిమాని స్పందిస్తూ.. గ్లోరియస్ ఏంజెల్ అంటూ పొగిడేశాడు. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల తర్వాత మృణాల్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.