కంటి చూపుతో చంపేస్తున్న ఈ చిన్నది ఎవరు...?

పై ఫోటోలో కళ్లు మాత్రమే కనిపిస్తున్న ముద్దుగుమ్మను చూశారు కదా... ఈ మధ్య కాలంలో తెలుగు లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా దూసుకు పోతుంది.

Update: 2024-05-24 06:04 GMT

పై ఫోటోలో కళ్లు మాత్రమే కనిపిస్తున్న ముద్దుగుమ్మను చూశారు కదా... ఈ మధ్య కాలంలో తెలుగు లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా దూసుకు పోతుంది. దశాబ్ద కాలంగా ఉత్తరాదిన ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడికి తెలుగు లో ఆ మధ్య వచ్చిన ఒక్క హిట్‌ తో ఒక్కసారిగా స్టార్‌ డమ్ దక్కించుకుంది.


వరుసగా రెండు హిట్స్ ను తెలుగు లో దక్కించుకున్న ఈ అమ్మడు భారీగా పారితోషికం పెంచింది. అయినా కూడా ఈమె ను తమ సినిమాల్లో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. హిందీ సీరియల్స్ నుంచి మొదలుకుని ఈ అమ్మడి కెరీర్ స్టార్‌ హీరోలకు జోడీగా నటించే వరకు సాగింది.

ఇప్పటికే ఈ అమ్మడు ఎవరో గుర్తు పట్టి ఉంటారు.. ఔను ఈమె మృణాల్ ఠాకూర్‌. సీతారామం సినిమా ద్వారా టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో మాత్రం నిరాశ పరిచింది.

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఆ సినిమా లో మృణాల్ నటనతో మెప్పించింది. అయితే సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా మృణాల్‌ మాత్రం తన పారితోషికంను పెంచింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

బాలీవుడ్‌ లో మళ్లీ ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు తమిళంలో ఒక సినిమా తెలుగు లో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యిందని సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌ లో ఓ బడా స్టార్‌ హీరో సినిమాలో నటించబోతుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఇలా కంటి చూపుతో చంపేస్తూ ఫోటోను షేర్‌ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆకట్టుకునే అందం తన సొంతం అంటూ మరోసారి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News