సీతామహాలక్ష్మి మళ్లీ మార్కులు కొట్టేసిందిగా..?

సినిమాలో కాస్త కూస్తో బాగుంది అంటే అది మృణాల్ పర్ఫార్మెన్స్ అని అంటున్నారు. సో ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయినా కూడా సినిమా చూసిన ఆడియన్స్ మృణాల్ పాస్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు.

Update: 2024-04-28 06:56 GMT

బాలీవుడ్ లో హీరోయిన్ గా చేస్తున్నా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేని మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రల్లో అమ్మడి నటన తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సీతారామం చూసి మృణాల్ కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమా ఎలాగు హిట్ పడ్డది కాబట్టి అవకాశాలు వరుసగా వచ్చాయి.

సీతారామం తర్వాత నానితో హాయ్ నాన్న సినిమా చేసిన మృణాల్ ఆ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంది. ఇక లేటెస్ట్ గా తన థర్డ్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మృణాల్. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరెక్షన్లో తెరకెక్కిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయి. సినిమా థియేట్రికల్ రిలీజ్ డిజాస్టర్ అనిపించుకోగా రీసెంట్ గా సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగా సినిమాను థియేటర్ లో స్కిప్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలో చూస్తున్నారు. అసలు సినిమా ఎక్కడ తేడా కొట్టింది అని చూసేందుకు సినిమాను ఓటీటీలో చూస్తున్నారు.

సినిమా కథ కథనాల్లో దర్శకుడి వైఫల్యం తెలుస్తున్నా హీరో క్యారెక్టరైజేషన్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇక కొద్దిలో కొద్దిగా సినిమా చూసిన వారంతా కూడా మృణాల్ నటనకు ఇంప్రెస్ అవుతున్నారు. సినిమాలో కాస్త కూస్తో బాగుంది అంటే అది మృణాల్ పర్ఫార్మెన్స్ అని అంటున్నారు. సో ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయినా కూడా సినిమా చూసిన ఆడియన్స్ మృణాల్ పాస్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. సీతారామ, హాయ్ నాన్నతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన మృణాల్ కమర్షియల్ గా ది ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా ఆడియన్స్ తన మీద పెట్టుకున్న అంచనాలను రీచ్ అయ్యిందనే చెప్పొచ్చు.

అయితే నెక్స్ట్ ఆఫర్ రావాలంటే చివరి సినిమా హిట్టా ఫ్లాపా అన్న ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మృణాల్ నెక్స్ట్ చేసే సినిమా కచ్చితంగా సక్సెస్ అయ్యి తీరాల్సిందే. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ ని తీసుకోవాలని ఇద్దరు ముగ్గురు దర్శకులు సంప్రదించారని తెలుస్తుంది. వాటిల్లో ఏది ఫైనల్ అయినా కూడా మృణాల్ మళ్లీ తన సత్తా చాటే ఛాన్స్ ఉంటుంది. తెలుగులో స్టార్ రేంజ్ కి వెళ్లే క్వాలిటీస్ అన్నీ ఉన్న మృణాల్ ఠాకూర్ కమర్షియల్ సక్సెస్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారితే మాత్రం ఆమెకు వరుస ఛాన్సులు రావడం ఖాయమని చెప్పొచ్చు.

Tags:    

Similar News