ముఫాసా ట్రైలర్.. మహేష్ సింహం కథ

తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేయాలని డిస్ని సంస్థ మహేష్ బాబును ముఫాసా పాత్రకు ఎంపిక చేసింది.

Update: 2024-08-26 06:35 GMT

డిస్నీ రూపొందిస్తున్న "ముఫాసా: ది లయన్ కింగ్" చిత్రానికి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు తన వాయిస్ అందించడం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. డిసెంబరు 20న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేయాలని డిస్ని సంస్థ మహేష్ బాబును ముఫాసా పాత్రకు ఎంపిక చేసింది.

ఇక ఫైనల్ గా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ముఫాసా ఒక రాజుగా తన గుంపును రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆధిపత్యం, శత్రువుల మధ్య అడవిలో ఉండే రాజ సింహం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఇక మహేష్ ఆ సింహం పాత్రకు తన వాయిస్ తో సరైన న్యాయం చేశాడు.

ముఫాస దారి తప్పి స్కార్ అనే టాకా ఫ్యామిలీలో చేరతాడు. ఇక అతనికి ఆ తరువాత ఆ కుటుంబంతో ఏర్పడిన అనుబంధం అలాగే రాజ్యాన్ని కాపాడుకోవాలి అనే ప్రయత్నం కూడా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ను హైలెట్ చేశారు. ఎంతైనా ముఫాసా బయటవాడే అన్నట్లు మిగతా సింహాలు దూరం పెడతాయి.

ఇక అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ కు బలం చేకూరింది. అడివికి ఒక్కడే రాజుగా ఉండాలి అని చూసిన శత్రువును ముఫాసా ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశం కూడా హైలెట్ అవుతోంది. ఇక 'ఒక్కటిగా పోరాడాలి' అనే నినాదం కథలో అసలైన క్లైమాక్స్ గా అనిపోస్తోంది.

చిన్నతనంలో అనాథగా మిగిలిన ముఫాసా ఎలా రాజుగా ఎదిగాడో, అతని కష్టాలు, విజయాలు, కుటుంబం పట్ల ఉన్న ప్రేమతో కూడిన కథను ఈ సినిమా చూపిస్తుంది. మహేష్ బాబు వాయిస్ ఈ పాత్రను మరింత జీవంతో తీర్చిదిద్దనుందని అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌పై మహేష్ బాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ముఫాసా పాత్రకు వాయిస్ అందించడం తనకెంతో ప్రత్యేకమైన అనుభవమని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఇక మరోవైపు పుంబా పాత్రకు బ్రహ్మానందం, టిమోన్ పాత్రకు అలీ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో, ఈ చిత్రం కామెడీ మరియు ఎమోషనల్ షేడ్స్‌ లోనూ ప్రత్యేకంగా నిలవనుంది. డిస్నీ టీమ్ డైరెక్టర్ బారీ జెన్కిన్స్‌ నేతృత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం, ఫోటో రియలిస్టిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీతో ప్రేక్షకులను కొత్త అనుభవంలోకి తీసుకెళ్లనుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా అనేక భాషల్లో డిసెంబర్ 20న విడుదల కాబోతోంది.

Tags:    

Similar News