హీరోయిన్ ద‌గ్గ‌ర నిజాన్ని అందుకే దాచా!

ముర‌గ‌దాస్ తెర‌కెక్కించిన `గ‌జినీ` త‌మిళ్, తెలుగు లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.;

Update: 2025-03-20 16:12 GMT

ముర‌గ‌దాస్ తెర‌కెక్కించిన `గ‌జినీ` త‌మిళ్, తెలుగు లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో రీమేక్ చేసి అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసారు. సంజ‌య్ సింఘానియా పాత్ర‌లో అమీర్ ఖాన్-క‌ల్ప‌న పాత్ర‌లో అసిన్ పాత్ర‌లు సినిమాకు పిల్ల‌ర్ లా నిలిచాయి. క‌ల్ప‌న అమాయ‌క‌త్వం, సింపుల్ సిటీ చూసి తొలి చూపులోనే సంజ‌య్ సింఘానియా ల‌వ్ లో ప‌డ‌టం.

ఇద్దరి మ‌ద్య స‌ర‌దా ట్రాక్స్ ఆక‌ట్టుకుంటాయి. అయితే సినిమాలో సంజ‌య్ సింఘానీయి పెద్ద బిజినెస్ మెన్ అని తెలియ‌కుండానే క‌ల్ప‌న పాత్ర చ‌నిపోతుంది. దీంతో ప్రేక్ష‌కులు అయ్యో పాపం అనుకుంటారు. తెలిసి ఉంటే బాగుండేది క‌థ‌ని ఫీల‌వుతారు. క‌థ‌ను సుఖంగా ముగిస్తే బాగుండేద‌ని అభిప్రాయ ప‌డ్డారు. అయితే తాజాగా ఈ విష‌యం గురించి ముర‌గ‌దాస్ స్పందించారు.

`సంజయ్ సింఘానియా నిజస్వరూపం తెలియకుండా గజినీలో కల్పన మరణించడం కథను మరింత ప్రభావితం చేసింది. ఒక‌వేళ నిజం తెలిస్తే సంజయ్ పగ బలహీనపడినట్టేనని మురుగదాస్ అభిప్రాయ ప‌డ్డారు. క‌ల్ప‌న అమాయకత్వం, విషాదకరమైన విధి చిత్రం యొక్క భావోద్వేగాన్ని, ఘాడ‌త‌ను తెలియ జేస్తుంద‌న్నారు. ఈ సినిమా రిలీజ్ అయి 16 ఏళ్లు అవుతుంది.

మ‌రి ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో? ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ్, తెలుగు, హిందీ ఆడియ‌న్స్ సీక్వెల్స్ చేయాల‌ని ఇప్ప‌టికే కోరుతున్నారు. కానీ ముర‌గ‌దాస్ మాత్రం ఆ ఛాన్స్ తీసుకోవ‌డం లేదు. అయితే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో చేసే అవ‌కాశాలున్నాయ‌ని మీడియాలో క‌థ‌నాలు చాలా కాలంగా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News