రామ్ చరణ్ అప్పుడే యంగ్ సెన్షేషన్ కర్చీప్
మణిశర్మ తనయుడు యువ సంగీత దర్శకుడు మహతి సాగర్ కెరీర్ ని మెగాస్టార్ చిరంజీవి కొత్త టర్నింగ్ తిప్పబోతున్న సంగతి తెలిసిందే
మణిశర్మ తనయుడు యువ సంగీత దర్శకుడు మహతి సాగర్ కెరీర్ ని మెగాస్టార్ చిరంజీవి కొత్త టర్నింగ్ తిప్పబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 'భోళా శంకర్' సినిమాకి సంగీతం అందించే బాధ్యలు సాగర్ కి అప్పగించడంతో! అతని పేరిప్పుడు మార్మిమోగిపోతుంది. ఎంతో మంది సీనియర్ సంగీత దర్శకులు..లైమ్ లైట్ లో ఉన్న వారిని సైతం పక్కనబెట్టి మరీ ఈ అవకాశం కల్పించారు. మణిశర్మతో చిరుకున్న బాండింగ్ కావొచ్చు. మహతి సాగర్ పై ఉన్న నమ్మకం కావొచ్చు.
కారణం ఏదైనా సాగర్ కెరీర్ కిది అతిపెద్ద అవకాశం. ఇంతవరకూ చిన్న సినిమాలకు మాత్రమే పనిచేసిన మహతికి మెగాస్టార్ తోనే పనిచేసే అరుదైన అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి హిట్ అయితే మహతి సాగర్ కెరీర్ మొత్తం మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ హీరోల చిత్రాలకు పనిచేసే అవకాశం సులభం అవుతుంది. వెనుక మణిశర్మ కూడా ఉన్నారు కాబట్టి ఆయన సూచనలు.. సలహాలతో మహతి సాగర్ గట్టెక్కిపోవడానికి ఈజీగా ఉంటుంది.
చిరు సినిమా కోసం తండ్రి రిఫరెన్స్ లు తీసుకున్నట్లు ఆయన ఓపెన్ గానే చెప్పారు. ఇలా మరో మూడు-నాలుగు సినిమాలకు పనిచేస్తే మహతి సాగర్ రాటు దేలిపోతాడు. కానీ యువ సంచలనం ఆదిలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కర్చీప్ వేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. చరణ్ సినిమాకి సంగీతం అందించాలని ఉందన్న మనసులో కోర్కెను బయట పెట్టాడు.
'మా నాన్న గారు సంగీతాన్ని అందించిన సినిమాల్లో నాకు ఇంద్ర ఇష్టం. ఆ సినిమాల రాధే గోవిందా పాట చాలా ఇష్టం. ఆ పాటలో చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్ - స్టెప్స్ బాగుంటాయి. చరణ్ కూడా ఆ స్టెప్స్ ను బాగా వేయగలరు. ఒకవేళ చరణ్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఆ పాట రీమేక్స్ తప్పకుండా చేస్తాను' అని అన్నారు.