మెగా హీరోని బుక్ చేసుకున్న మైత్రి మేకర్స్..!
RRR తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ గా రాం చరణ్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ విషయంలో కూడా అదే రేంజ్ కొనసాగిస్తున్నాడు.
RRR తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ గా రాం చరణ్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ విషయంలో కూడా అదే రేంజ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. ఆర్సీ 16వ సినిమాగా వస్తున్న ఈ మూవీ లాంచింగ్ రీసెంట్ గా జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
దేవర సినిమా తర్వాత చరణ్ తో కలిసి జత కడుతుంది జాన్వి కపూర్. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించడం స్పెషల్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ గా కొనసాగుతున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే అల్లు అర్జున్ తో పుష్ప, పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. చరణ్ తో బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టారు. అయితే చరణ్ నెక్స్ట్ సినిమా కూడా వీరి బ్యానర్ లోనే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
బుచ్చి బాబు తర్వాత రాం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. పుష్ప 2 పూర్తి కాగానే సుకుమార్ చరణ్ సినిమా కథ మీద వర్క్ చేస్తారని తెలుస్తుంది. చరణ్ తో సుకుమార్ ఆల్రెడీ రంగస్థలం సినిమా చేశాడు. ఆ సినిమాతోనే చరణ్ రేంజ్ మరింత పెరిగింది. చిట్టుబాబుగా చరణ్ తన నట విశ్వరూపం చూపించాడు. మళ్లీ అదే కాంబో రిపీట్ చేస్తున్నారు.
పుష్ప తర్వాత సుకుమార్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. సో చరణ్ తో చేసే సినిమా కూడా నేషనల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకునే కథ సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. ఎలాగు బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమాతోనే పాన్ వరల్డ్ ని షేక్ చేయాలని ఫిక్స్ అయిన చరణ్ సుక్కు సినిమాతో ఆ మాస్ రాంపేజ్ కొనసాగించాలని చూస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం మరింత క్రేజీగా ఉంది. సో చరణ్ 16, 17 రెండు సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ తోనే చేస్తున్నాడు. రెండు సినిమాలకు కలిపి రెమ్యునరేషన్ గా కూడా చరణ్ బాగానే డిమాండ్ చేసి ఉంటారని చెప్పుకుంటున్నారు.