మైత్రి వారి బిజినెస్.. మంచి ప్లానే

ఏడాదికి తక్కువలో తక్కువగా 5 నుంచి 6 సినిమాల వరకు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తున్నాయి.

Update: 2023-10-22 01:30 GMT

శ్రీమంతుడు సినిమాతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓ వైపు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు మరో వైపు మీడియం రేంజ్ హీరోలతో లో బడ్జెట్ మూవీస్ చేస్తున్నారు. ఏడాదికి తక్కువలో తక్కువగా 5 నుంచి 6 సినిమాల వరకు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తున్నాయి.

వీటిలో కొన్ని చిన్న సినిమాలని కొనేసి తమ బ్యానర్ సమర్పణలో రిలీజ్ కూడా చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు కొన్ని చిన్న సినిమాలు కలెక్షన్స్ కనీసం థియేటర్స్ రెంట్స్ కి కూడా రావడం లేదు. ఈ కారణంగా కోట్లలో నష్టం వస్తోంది. మరో వైపు డిస్టిబ్యూటర్స్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు.

పెద్ద సినిమాలకి సంబందించిన ఏరియా రైట్స్ కొనేసి రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా భాగానే ఉన్న స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినపుడు థియేటర్స్ సమస్య వస్తోంది. తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ అన్ని కూడా ఓ నలుగురు చేతులలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము కూడా థియేటర్ ఏజెన్సీ లోకి రావాలని ప్లాన్ చేస్తున్నారంట.

రాష్ట్రంలో ఇప్పటికే మూత థియేటర్స్ ని కొనుగోలు చేసి వాటిని రిమోడలింగ్ చేయడం, అలాగే ప్లేస్ చూసుకొని థియేటర్స్ చైన్ లా మల్టీప్లెక్స్ ని నిర్మించడం ద్వారా భవిష్యత్తులో మూవీస్ రిలీజ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసారంట. రెండు తెలుగు రాష్ట్రాలలో మూతపడిన థియేటర్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో దిల్ రాజు, సురేష్ బాబు, గీతా ఆర్ట్స్, ఏషియన్ తరహాలోనే మైత్రీ వారి చేతిలో కూడా థియేటర్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. లోబడ్జెట్ లో చిన్న సినిమాలు కూడా నిర్మించి లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

Tags:    

Similar News