అక్కినేని ఫ్యామిలీలో చైతూ ఒక్కడే..!
ముఖ్యంగా త్వరలో రిలీజ్ కాబోతున్న తండేల్ సినిమా విషయంలో ఫ్యాన్స్ అయితే ఆకాశాన్ని అంటే అంచనాలు పెట్టుకున్నారు.
కింగ్ నాగార్జున సోలో సినిమాల కన్నా సపోర్టింగ్ రోల్స్ మీద దృష్టి పెడుతున్నారు. మరోపక్క అఖిల్ ఏమో ఏజెంట్ సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా కూడా నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇవ్వట్లేదు. ఆ ఇద్దరితో పోలిస్తే కాస్త నాగ చైతన్యానే వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగ చైతన్యకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. ముఖ్యంగా త్వరలో రిలీజ్ కాబోతున్న తండేల్ సినిమా విషయంలో ఫ్యాన్స్ అయితే ఆకాశాన్ని అంటే అంచనాలు పెట్టుకున్నారు.
చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు దేవి అందించిన మ్యూజిక్ వల్ల సినిమాకు విపరీతమైన పాజిటివ్ బజ్ వచ్చింది. సినిమా ట్రైలర్ కూడా సినిమా బజ్ ని మరింత పెంచింది. ఐతే తండేల్ సినిమాకు వస్తున్న ఈ వైబ్ చూస్తుంటే నాగ చైతన్య గట్టిగా కొట్టేలానే ఉన్నాడు.
రీసెంట్ గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అక్కినేని లెక్కలు మారబోతున్నాయని చెప్పించారు. సో తండేల్ తో అక్కినేని హీరోలు కూడా 100 కోట్లు ఆ పైన కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. తండేల్ కి అన్నీ కలిసి వచ్చేలా ఉన్నాయి. ఎలాగు పోటీలో మరో సినిమాల లేదు.సో తప్పకుండా సినిమా పాటలు, ట్రైలర్ కి తగినట్టుగా ఉంటే మాత్రం రాజులమ్మ జాతర సాక్షిగా రికార్డులు కొట్టే ఛాన్స్ ఉంటుంది.
టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీ అయిన అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున స్టార్ గా ఎన్నో ప్రయోగాలు.. ప్రయత్నాలు చేసి అదరగొట్టారు. అంతేకాదు ఆయన మార్క్ సినిమాలు చేస్తూ అక్కినేని ఫ్యాన్స్ ని అలరిస్తూ వచ్చారు. ఐతే ఈ మధ్య సీనియర్ హీరోలంతా కూడా తమ దూకుడు చూపిస్తుంటే నాగార్జున మాత్రం సరైన కథలు దొరక్క వెనకపడ్డారు. నా సామిరంగ హిట్ కొట్టినా నాగ్ వెంటనే మరో సినిమా మొదలు పెట్టలేదు. కూలీ, కుబేర సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. నాగార్జున తర్వాత అఖిల్ కూడా నెక్స్ట్ మూవీ పై ఇంకా నాన్చుతున్నాడు. ఈ ఇద్దరిని పక్కన పెడితే నాగ చైతన్య తన సినిమాలతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నాడు. మరి తండేల్ తో అక్కినేని లెక్కలు మార్చేస్తాడా లేదా అన్నది మరో 4 రోజుల్లో తెలుస్తుంది.