అభిమానితో సామాన్యుడిలా చైతూ!

కానీ, కొందరు మాత్రం డౌన్ టూ ఎర్త్ ఉంటూ ప్రశంసలు పొందుతున్నారు.

Update: 2024-10-26 18:55 GMT

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం చాలా అవసరం. కానీ, ఇది చాలా మంది ఫాలో అవరు. ముఖ్యంగా కొంత నేమ్, ఫేమ్, డబ్బు వస్తే తమను కొట్టే వారు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. సినిమా రంగంలోని ప్రముఖుల్లో ఎక్కువ శాతం మంది ఇదే తరహా ప్రవర్తనతో విమర్శల పాలు అవుతున్నారు. కానీ, కొందరు మాత్రం డౌన్ టూ ఎర్త్ ఉంటూ ప్రశంసలు పొందుతున్నారు. అందులో అక్కినేని నాగ చైతన్య ఒకడు.

కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యువ సామ్రాట్ నాగ చైతన్య చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. అయితే, ఈ మధ్యన కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఇప్పుడు భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు.

భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ అనే సినిమాను చేస్తున్నాడు. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా సక్సెస్ సాధించిన చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి నిజమైన కథ ఆధారంగా రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా చేస్తున్నారు.

‘తండేల్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నాగ చైతన్య తాజాగా కొందరు అభిమానులతో కలిశాడు. ఈ సందర్భంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఎలాగో నిరూపిస్తూ వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడాడు. ముఖ్యంగా ఓ ఫ్యాన్ ‘తండేల్’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయమని ఈ వీడియోలో అడుగుతున్నాడు. మరో అభిమాని మాత్రం సినిమా రిలీజ్ విషయం గురించి నాగ చైతన్యతో మాట్లాడుతూ కనిపించాడు.

సాధారణంగా చాలా మంది హీరోలు అభిమానులను అస్సలు పట్టించుకోరు. కానీ, అక్కినేని నాగ చైతన్య మాత్రం తన అభిమాని చెప్పేది ఎంతో ఓపికతో విన్నాడు. అలాగే, సినిమా రిలీజ్ గురించి చర్చించాడు. దీంతో ఈ వీడియోను అక్కినేని ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫలితంగా నాగ చైతన్య వీడియో చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది.

తన అభిమానితో అక్కినేని నాగ చైతన్య ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు అయితే ‘నాగ చైతన్యను చూసి ఇప్పటి చాలా మంది హీరోలు నేర్చుకోవాలి’ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ యంగ్ హీరో చేసిన పనిని మెచ్చుకోవాల్సిందే.

Tags:    

Similar News