ఎంగేజ్‌మెంట్కు ముందే సమంత జ్ఞాపకాలను చెరిపేసిన నాగచైతన్య!?

ఇదిలా ఉంటే సమంత రూత్ ప్రభు ప్రపోజ్ చేసిన రోజే శోభిత ధూళిపాళతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Update: 2024-08-08 16:50 GMT
ఎంగేజ్‌మెంట్కు ముందే సమంత జ్ఞాపకాలను చెరిపేసిన నాగచైతన్య!?
  • whatsapp icon

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ త్వరలో వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నారు. ఇన్నాళ్ళూ వార్తల్లో ఉన్న రూమర్స్ ను నిజం చేస్తూ, వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఫ్యామిలీ పెద్ద అక్కినేని నాగార్జున ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, కాబోయే వధూ వరులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎంగేజ్‌మెంట్కు ముందే చైతూ తన మాజీ భార్య జ్ఞాపకాలను చెరిపేసినట్లు తెలుస్తోంది.

చైతన్య ఇంతకముందు స్టార్ హీరోయిన్ సమంత ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో, వీరిద్దరూ నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోక ముందే విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇది జరిగిన కొన్నాళ్ళకు సామ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి మాజీ భర్త ఫొటోలను, ఇద్దరు సన్నిహితంగా ఉన్న చిత్రాలను, పెళ్ళి ఫొటోలను డిలీట్ చేసింది. కానీ నాగచైతన్య మాత్రం సమంతతో ఉన్న ఫొటోలను అలానే ఉంచారు. కానీ ఇప్పుడు ఆయన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే తన మాజీ భార్య ఫోటోలు ఏవీ కనిపించం లేదు.

శోభితతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్న నాగచైతన్య.. నిశ్చితార్థానికి ముందు సమంత జ్ఞాపకాలేవీ ఉండొద్దని అనుకున్నారో ఏమో, ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫోటోలన్నీ తొలగించారు. పర్మినెంట్ గా డిలీట్ చేశారో లేదా కనిపించకుండా హైడ్ చేశారో తెలియదు కానీ, ఇప్పుడు చైతూ సోషల్ మీడియాలో మాజీ భార్య పిక్స్ లేవు. కేవలం వాళ్లిద్దరూ కలిసి నటించిన 'మజిలీ' సినిమాకు సంబంధించిన ఫొటోలు, తమ పెట్ డాగ్ యాష్ తో ఉన్న పిక్స్ మాత్రమే ఉన్నాయి.

ఇదిలా ఉంటే సమంత రూత్ ప్రభు ప్రపోజ్ చేసిన రోజే శోభిత ధూళిపాళతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. గతంలో 08.08 తేదీనే చైతూకి సామ్ లవ్ ప్రపోజ్ చేసిందని, అదే డేట్ కి కావాలనే యువ సామ్రాట్ తన ప్రేయసితో నిశ్చితార్ధం చేసుకున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ, ఈ విధంగా తన ఎక్స్ వైఫ్ పై స్వీట్ రివేంజ్ తీర్చుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

కాబోయే భార్య భర్తలు శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్యలకు అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ అందజేస్తున్నారు. "మా ప్రియతమ తండేల్ రాజు అకా యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య & శోభిత గార్లకు అభినందనలు. మీరు అంతులేని ప్రేమ, సంతోషంతో ఉండాలని తండేల్ టీమ్ కోరుకుంటోంది" అని గీతా ఆర్ట్స్ సంస్థ పోస్ట్ పెట్టింది. సుధీర్ బాబు, సుశాంత్ లాంటి హీరోలు కూడా చై-శోభితాకి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News