నాగ్.. మళ్ళీ ఇన్నాళ్ళకు ఎవర్ గ్రీన్ కాంబో
కింగ్ నాగార్జున ఈ ఏడాది నా సామి రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు.
కింగ్ నాగార్జున ఈ ఏడాది నా సామి రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా సంక్రాంతి రేసులో గట్టి పోటీని తట్టుకొని నిలబడింది. ఇదిలా ఉంటే 2025 సంక్రాంతికి కూడా నాగార్జున ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావాలని అనుకుంటున్నారు. సోగ్గాడే చిన్నినాయనా పార్ట్ 3పైన వర్క్ అవుట్ చేస్తున్నారు.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందంట. ఈ సినిమా గురించి మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ పార్ట్ 3 కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ అయ్యారంట.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకొని మంచి జోష్ లో ఉన్నారు. అలాగే వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అయితే కింగ్ నాగార్జున కోసం ఈ సీక్వెల్ చేయడానికి ఒప్పుకున్నారంట. నాగార్జున, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో గతంలో మన్మధుడు, కింగ్, మాస్, ఢమరుకం, భాయ్ సినిమాలు వచ్చాయి. వీటిలో నాలుగు సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్ అయ్యాయి.
మన్మధుడు సాంగ్స్ అయితే ఇప్పటికి ఎవర్ గ్రీన్ గా ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఆడియన్స్ కూడా సూపర్ హిట్ ఆల్బమ్ గ్యారెంటీ అని ముందే డిసైడ్ అయిపోతారు. మరల 11 ఏళ్ళ గ్యాప్ మరల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో కచ్చితంగా సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.
సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు చిత్రాలకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. అయితే పార్ట్ 3 కోసం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ని ఎంపిక చేసుకున్నారు. అనూప్ రూబెన్స్ కూడా ఈ రెండు సినిమాలకి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. సూపర్ హిట్ సినిమాలకి సీక్వెల్ గా వస్తోన్న మూవీ కావడంతో కచ్చితంగా 2025 సంక్రాంతి రేసులో ఈ మూవీ గట్టి పోటీ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలాగే మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.