చైతన్య విడాకుల తరువాత.. నాగార్జున ఏమన్నారంటే
ఇదిలా ఉంటే న్యూస్ వెబ్ సైట్ తో నాగార్జున మాట్లాడుతూ విడాకుల తర్వాత నాగ చైతన్య చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం బయటకి రాలేకపోయాడు.
అక్కినేని యువ హీరో నాగ చైతన్య, బ్యూటీఫుల్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ గురువారం జరిగిన సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోని ఈ వేడుక జరిగింది. అనంతరం నాగార్జున వారి ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేసి అధికారికంగా ఎంగేజ్మెంట్ అయినట్లు కన్ఫర్మ్ చేశారు. వారిద్దరికి బ్లెస్సింగ్స్ అందించారు. అదే సమయంలో 8.8.8 డేట్ ని కింగ్ నాగార్జున ప్రత్యేకంగా మెన్షన్ చేశారు.
ఈ డేట్ వారి జాతకాలు ప్రకారం మంచిది కావడంతో ఎంగేజ్మెంట్ చేసినట్లు కింగ్ నాగార్జున ఓ ఇంగ్లీష్ న్యూస్ వెబ్ సైట్ తో షేర్ చేసుకున్నారు. అయితే అదే డేట్ కి సమంత నాగ చైతన్యకి గతంలో ప్రపోజ్ చేసిందని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే న్యూస్ వెబ్ సైట్ తో నాగార్జున మాట్లాడుతూ విడాకుల తర్వాత నాగ చైతన్య చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం బయటకి రాలేకపోయాడు.
నాగ చైతన్య తన ఎమోషన్స్ ని ఎవరితో షేర్ చేసుకోడు. భావాలని వ్యక్తం చేయడు. చైతన్య పరిస్థితి చూసి మాకు కూడా బాధ కలిగింది. మరల శోభిత వాడి లైఫ్ లోకి వచ్చిన తర్వాత సంతోషంగా ఉంటున్నాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ తో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. వారిద్దరి జాతకాల ప్రకారం మంచి ముహూర్తం అని చెప్పడంతో రెండు కుటుంబాల తరుపున మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ వెంటనే చేయడం జరిగింది. పెళ్లికి ఇంకా సమయం ఉంది.
వారిద్దరూ ఒకే అన్న తర్వాత మంచి ముహూర్తం చూసి పెళ్లి విషయాన్ని చెబుతామని నాగార్జున అన్నారు. శోభిత తల్లిదండ్రులకి కూడా నాగ చైతన్య అంటే ఇష్టం. వారు మనస్పూర్తిగా చైతన్యని ప్రేమించారు. నా పిల్లలు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రయోజకులుగా మారినందుకు ఆనందంగా ఉంది. చైతన్యతో ప్రేమలో పడకముందే శోభిత నాకు ఒక నటిగా తెలుసు. గూఢచారి మూవీ ఈవెంట్ లో ఒకసారి ఆమెని కలవడం జరిగింది. ఆమె యాక్టింగ్ నచ్చడంతో ఆ విషయం ఆమెకి చెప్పాను. అయితే రెండేళ్లుగా శోభిత, చైతన్య ప్రేమించుకుంటున్నారు.
శోభిత చాలా తెలివైన అమ్మాయి. వారిద్దరి బంధం కచ్చితంగా బాగుంటుందని నాగార్జున మీడియాతో పంచుకున్నారు. సమంతతో నాగ చైతన్యకి 2021లోనే విడాకులు అయ్యాయి. తరువాత ఏడాది నుంచి చైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారు. చాలా సార్లు వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వారు ఎప్పుడు కూడా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.