కర్ణుడి పాత్ర ఎలా వచ్చిందంటే..: నాగ్ అశ్విన్

ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో కల్కి2898ఏడీ పార్ట్ 2 మీద అంచనాలు పెరిగిపోయాయి.

Update: 2024-07-05 08:30 GMT

కల్కి 2898ఏడీ మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే 725 కోట్లు దాటిన కల్కి కలెక్షన్స్ ఈ మూడు రోజులు దాటేసరికి 900 కోట్లకి రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీ కల్కి అవుతుందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ భైరవ పాత్ర, అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ రోల్ సినిమాని టాప్ లో నిలబెట్టాయి. వీటికి అదనంగా సుమతి పాత్రలో దీపికాపదుకునే, సుప్రీమ్ యాస్కిన్ గా కమల్ హాసన్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో కల్కి2898ఏడీ పార్ట్ 2 మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే మూవీ కథనం, క్యారెక్టరైజేషన్స్ పరంగా కొన్ని లోపాలు ఉన్నాయని ఓ వర్గం నుంచి విమర్శలు వచ్చాయి. కర్ణుడి పాత్ర విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే సినిమాలో దిశా పటాని రోల్ అసంతృప్తిగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అలాగే కల్కి కథలోకి కర్ణుడు ఎలా వచ్చాడని హిందుత్వ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు ఒప్పుకున్నాడు. ఇంకా 25-30 నిమిషాల సీన్స్ కలపలేదని చెప్పాడు. మూవీ లెంత్ ఎక్కువ అవుతుందని భావించి కొన్ని మంచి సీన్స్ కూడా తొలగించామని అన్నారు. కల్కి పార్ట్ 2లో ఇంకా అసలైన కథ చాలా ఉంటుందని, పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని అన్నారు. ప్రతి క్యారెక్టర్ కి పెర్ఫెక్ట్ ఎండింగ్ పార్ట్ 2 లో ఉంటుందని తెలిపారు.

Read more!

ముఖ్యంగా గాండీవాన్ని పట్టుకోగలిగిన సుప్రీమ్ యాస్కిన్ ని అశ్వద్ధామ, కర్ణుడు ఎలా ఎదుర్కొంటారు అనేది మెయిన్ కథాంశంగా కల్కి పార్ట్ 2 ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పారు. అయితే కథని కూడా ఎక్కడా డీవియేట్ కాకుండా అందరూ ఏకీభవించే విధంగానే పార్ట్ 2ని చేయనున్నట్లు నాగ్ అశ్విన్ చెప్పారు. కల్కి సినిమాలో భైరవ క్యారెక్టర్ కర్ణుడి పునర్జన్మగానే ఉండబోతోందని. పార్ట్ 2లో ఆ క్యారెక్టర్ ని పూర్తిస్థాయిలో ఎలివేట్ చేయబోతున్నట్లు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.

మహాభారతంలో ధర్మం పక్షాన నిలిచిన అర్జునుడి గాండీవం ఇప్పుడు భయంకరమైన వినాశకారి సుప్రీమ్ యాస్కిన్ చేతికి వెళ్లి అధర్మానికి అండగా నిలవడం అనే పాయింట్ కి హిందుత్వ వర్గాలు ఎంత వరకు కనెక్ట్ అవుతారనేది ప్రశ్నగా ఉంది. అలాగే కల్కిపురాణంతో సంబంధం లేని కర్ణుడి పాత్రని ప్రవేశపెట్టడంతో పాటు ధర్మం వైపున అతను నిలబడి గాండీవంతో తలపడే ఎలిమెంట్స్ కూడా కథలో కీలకంగా ఉండనున్నాయి. వీటిని ఆడియన్స్ అంగీకరిస్తారా అనేది చూడాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News

eac