నాగి ఆ ముగ్గురిని సెంటిమెంటుగా భావిస్తున్నాడా?

నాగ్ అశ్విన్ సినిమా అంటే కచ్ఛితంగా అతిథి పాత్రలు ఉంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు

Update: 2024-06-27 16:26 GMT

నాగ్ అశ్విన్ సినిమా అంటే కచ్ఛితంగా అతిథి పాత్రలు ఉంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు. గెస్ట్ రోల్స్ తో పాటుగా తన గత సినిమాల్లోని నటీనటులను రిపీట్ చేయడం దర్శకుడికి అలవాటుగా మారిపోయింది. నాగి ఇప్పటి వరకూ 'ఎవడే సుబ్రమణ్యం', 'మహానటి' వంటి సినిమాలను తెరకెక్కించారు. నిర్మాతగా మారి 'జాతి రత్నాలు' చిత్రాన్ని నిర్మించారు. వీటన్నిటిలోనూ అభిమానులను సర్ప్రైజ్ చేసే ఎన్నో క్యామియోలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'కల్కి' చిత్రంలోనూ అతిథి పాత్రలు ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నాయి.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ 'కల్కి 2898 AD' ఈరోజు భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చింది. ముందు నుంచి చెప్పుకుంటున్నట్లుగానే, ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. హలీవుడ్ రేంజ్ సినిమా తీశారని అందరూ నాగీని కొనియాడుతున్నారు. హిందూ పురాణాల స్పూర్తితో, కొన్ని వందల ఏళ్ల తర్వాత భవిష్యత్ ప్రపంచాన్ని ఊహించి కథగా మలిచిన దర్శకుడి విజన్ ను మెచ్చుకుంటున్నారు.

Read more!

'కల్కి 2898 AD' సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, మాళవిక నాయర్, అన్నా బెన్, శోభన, పశుపతి, రాజేంద్రప్రసాద్, శాశ్వత చటర్జీ, కావ్య రామచంద్రన్ వంటి ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. వీరితో పాటుగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా, శ్రీనివాస్ అవసరాల.. పాపులర్ డైరెక్టర్స్ ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ తదితరులు అతిథి పాత్రలు పోషించారు.

నాగ్ అశ్విన్ ఫిల్మోగ్రఫీని పరిశీలిస్తే.. ఆయన తీసిన మూడు చిత్రాల్లోనూ ముగ్గురు నటీనటులు భాగమయ్యారు. వారే విజయ్ దేవరకొండ, శ్రీనివాస్ అవసరాల, మాళవిక నాయర్. ఇక VD అయితే 'జాతిరత్నాలు' చిత్రంలోనూ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. అలానే 'మహానటి'లో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ ను.. జాతిరత్నాలులో నవీన్ పోలిశెట్టి స్కూల్ టైమ్ క్రష్ పాత్రలో కనిపించింది. ఇప్పుడు 'కల్కి'లో భైరవ వాహనంలో ఉండే ఏఐ బుజ్జి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది.

4

అంతేకాదు 'మహానటి'లో చేసిన దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్.. 'జాతిరత్నాలు'లో నటించిన ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, అనుదీప్ కేవీలు 'కల్కి'లో ఉన్నారు. 'ఎవడే సుబ్రమణ్యం'లో ఉన్న సివిఎల్ నరసింహారావు, జాతిరత్నాలులోనూ కనిపిస్తాడు. ఈ విధంగా నాగ్ అశ్విన్ తన సినిమాల్లో క్యామియోలతో పాటుగా, యాక్టర్స్ ను రిపీట్ చేస్తూ వస్తున్నారు. విజయ్ దేవరకొండను ప్రతీ చిత్రంలో భాగం చేస్తున్నారు. దర్శకుడు సెంటిమెంటుగా భావించి ఇలా చేస్తున్నారా?, లేదా వారితో ఉన్న సాన్నిహిత్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారా? అనేది తెలియదు కానీ.. ఈ అతిథి పాత్రలు మాత్రం సినిమాకి ప్లస్ అవుతున్నాయనే అనుకోవాలి.

Tags:    

Similar News