నా సామి రంగ.. ఇందుకే నాగ్ గ్రేట్

జనవరి 5వ తేదీ కల్లా షూటింగ్ పూర్తి చేసేసుకుంది. 90రోజుల కన్నా తక్కువ టైమ్ లోనే షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. అందుకు ఈ ఏజ్ లో కూడా నాగార్జున సహకరించడం గ్రేటే.

Update: 2024-01-07 03:36 GMT

సంక్రాంతి పండుగకు టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్, వెంకటేశ్ తోపాటు కింగ్ నాగార్జున కూడా సందడి చేసేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన నా సామి రంగ.. పెద్ద పండుగ కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. రిలీజ్ కు ఇంకా 8రోజులే ఉన్నా చిత్రయూనిట్ ఎలాంటి ప్రమోషన్లు నిర్వహించడం లేదు. కానీ సినిమా నుంచి వరుసగా పాటలు, గ్లింప్స్, పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

ఈ సినిమాలో నాగార్జునతో పాటు యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి పాత్రలను ఇప్పటికే చిత్రబృందం పరిచయం చేసేసింది. ముగ్గురు హీరోల సినిమా అవ్వడంతో అసలైన సంక్రాంతి వినోదాల విందును కచ్చితంగా నా సామి రంగ మాత్రమే అందిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. పాటలు, అయితే ఈ సినిమా కోసం నాగార్జున చాలా కష్టపడ్డారట. అనేక ఫీట్లు చేశారట.

మలయాళ సూపర్ హిట్ చిత్రం పొరింజడు మరియం జోస్ రీమేక్ హక్కులను పొందిన నాగార్జున.. ఫస్ట్ దర్శకుడి కోసం చూశారు. అనేక మంది పేర్లను పరిశీలించి.. చివరకు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని ఎంపిక చేశారు. ఈ సినిమా తోనే విజయ్ డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచమయవ్వనున్నారు. ఆ తర్వాత షూటింగ్ విషయంలోనూ నాగార్జున ఫుల్ సపోర్ట్ చేశారు.

గతేడాది సెప్టెంబరు లో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా.. జనవరి 5వ తేదీ కల్లా షూటింగ్ పూర్తి చేసేసుకుంది. 90రోజుల కన్నా తక్కువ టైమ్ లోనే షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. అందుకు ఈ ఏజ్ లో కూడా నాగార్జున సహకరించడం గ్రేటే. షూటింగ్ పూర్తయ్యాక ఎట్టిపరిస్థితిల్లోనూ సంక్రాంతికే ఈ సినిమా విడుదల చేయాలని నాగ్ పట్టుబట్టారు. ఇదివరకే సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజుతో పెద్ద పండుగకు వచ్చి కింగ్ హిట్లు కొట్టిన విషయం తెలిసిందే.

ఇక, ఈ మూవీ ఓటీటీ హక్కుల అమ్మకం విషయంలో నాగార్జున చొరవ తీసుకుని పెద్ద డీల్ కుదర్చారు. నా సామి రంగ ఓటీటీ హక్కులను టాప్ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా నాగార్జునే డీల్ చేయించారట.

మరోవైపు, సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల రిలీజ్ ఉండడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు నాగార్జున. థియేట్రికల్ రైట్స్ ను పూర్తిగా ఆయనే కొనుగోలు చేశారు. తన బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. తమ సంస్థకు ఉన్న నెట్ వర్క్ ద్వారా భారీ స్థాయిలో థియేటర్లను దక్కించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూవీ రిలీజ్ కు రంగం సిద్ధం చేశారు. మొత్తానికి నా సామి రంగ సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అలా అన్నింట్లోనూ నాగార్జునే కీ రోల్ ప్లే చేశారు. మరి ఈ సినిమా కోసం ఇంత కష్టపడ్డ నాగార్జున హిట్ కొడతారో లేదో చూడాలి.

Tags:    

Similar News