కమ్ముల సినిమా.. నాగ్ మళ్ళీ అలాంటి పాత్రేనా?
ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున ఒక గ్యాంగ్ స్టార్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి.
నాగార్జున స్పెషల్ క్యారెక్టర్స్ చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రయోగత్మకమైన సినిమాలలో సెలెక్ట్ చేసుకోవడంలో తెలుగు హీరోలలో నాగార్జున కూడా టాప్ లిస్టులో ఉంటాడు. ఇక కథ నచ్చితే హీరో రేంజ్ ని చూడకుండా గెస్ట్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. ఇక నాగర్జున తమిళ హీరో ధనుష్ తదుపరి సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అక్కినేని హీరో పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. అయితే ఈ సినిమాలో నాగార్జున ఎన్నడూ చేయని కొత్త తరహా పాత్రలో కనిపిస్తాడెమో అని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున ఒక గ్యాంగ్ స్టార్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వుంటేనే ఒక గ్యాంగ్ స్టార్ టచ్ లో కథ కొనసాగుతూ ఉంటుందట. ఇక నాగార్జున పాత్ర ద్వారానే ఈ సినిమా అసలు కథ మలుపు తిరగనున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా దర్శకుడు కమ్ముల హీరో ధనుష్ అలాగే నాగర్జున మధ్యలో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేశాడు. దాదాపు రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది.
అయితే నాగార్జున ఇదివరకే నానితో చేసిన దేవదాస్ సినిమాలో కూడా గ్యాంగ్ స్టార్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించాడు. అందులో కాస్త నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ అయితే కాలేదు. నాగ్ కు గ్యాంగ్ స్టర్ డ్రామాలు కొత్తేమి కాదు. డాన్, సూపర్, ది ఘోస్ట్, భాయ్.. ఇలా చాలా సార్లు అలాంటి కథలను టచ్ చేశాడు.
ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కూడా నాగార్జున గ్యాంగ్ స్టర్ గా నెగిటివ్ షేడ్ లో కనిపిస్తాడు అనగానే పాత సినిమాల ప్రస్తావన ఇప్పుడు హైలైట్ అవుతోంది. అయితే శేఖర్ కమ్ముల ప్రజెంటేషన్ విషయంలో పెద్దగా పొరపాట్లు అయితే ఉండవు. ఈసారి అతని స్టైల్ కు భిన్నంగా సరికొత్త కథతో రాబోతున్నాడు కాబట్టి సినిమాలో ఖచ్చితంగా నాగార్జున పాత్ర రొటీన్ గా ఉండదు అని చెప్పవచ్చు. నేషనల్ వైడ్ లో అందరికీ కనెక్ట్ అయ్యేలా దర్శకుడు తన కథతో తో మ్యాజిక్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి నాగర్జున పాత్ర ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.