నాని పారడైస్.. అదే నిజమైతే మాత్రం..?

న్యాచురల్ స్టార్ నాని తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనే మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

Update: 2025-01-01 03:57 GMT

న్యాచురల్ స్టార్ నాని తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనే మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. నాని తొలి సినిమా ఆఫర్ ఇచ్చి మళ్లీ ఆ డైరెక్టర్ రెండో ఆఫర్ కూడా ఇవ్వడం అంటే అది కచ్చితంగా స్పెషల్ థింగ్ అని చెప్పొచ్చు. నాని డైరెక్టర్స్ ని పరిచయం చేస్తాడు ఆ తర్వాత మరో సినిమా చేయాలన్నా సరే కుదరదు. ఐతే ఆల్రెడీ సినిమా చేసిన అనుభవం ఉన్న వివేక్ ఆత్రేయతోనే నాని రెండు సినిమాలు చేశాడు. ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ లెక్క వేరే. నానిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన కాబట్టి నాని కాదనలేడు.

ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓదెలతో నాని రెండో సినిమా చేయడం పట్ల సర్వత్రా ఆసక్తిగా ఉంది. దసరా తర్వాత ఈ కాంబో మళ్లీ కలిసి పనిచేయడం అనేది నాని ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఐతే ఈసారి ఈ ఇద్దరు కలిసి ముందు సినిమా కన్నా పెద్దగా అంటే దసరాని మించిన సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. నాని శ్రీకాంత్ ఓదెల రెండో సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుందని టాక్.

ఐతే ఈ సినిమాకు చిత్ర యూనిట్ పారడైస్ అనే టైటిల్ అనుకోగా అది కాస్త లీక్ అయ్యింది. నాని పారడైస్ సినిమా విషయంలో ప్లానింగ్ చాలా పెద్దగా ఉందని టాక్. ముఖ్యంగా ఈ సినిమా గురించి వచ్చిన లేటెస్ట్ లీక్ సినిమాను రెండు భాగాలుగా చేస్తున్నారట. నాని సినిమా రెండు భాగాలా అని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈమధ్య కాన్సెప్ట్ బాగున్న సినిమాలన్నీ కూడా కొనసాగించేందుకు ఏమాత్రం ఆలోచించట్లేదు. ఆడియన్స్ కూడా సినిమా రెండు భాగాలనగానే క్రేజీగా ఫీలవుతున్నారు.

సినిమా రెండు భాగాలు అనుకోవడం ఈజీనే కానీ దాన్ని అలా తీసి ఆడియన్స్ చేత కన్విన్స్ చేయించడమే చాలా పెద్ద టాస్క్. ఐతే శ్రీకాంత్ ఓదెల మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న నాని మాత్రం పారడైస్ తో రెండు భాగాల అటెంప్ట్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా కాస్ట్ అండ్ క్రూ వెతికే పనిలో ఉన్న డైరెక్టర్ సినిమాను న్యూ ఇయర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.

Tags:    

Similar News