సలార్ దెబ్బకు.. నాని కూడా జంప్!
ప్రభాస్ సలార్ సినిమా వాయిదా తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది.
ప్రభాస్ సలార్ సినిమా వాయిదా తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. పెద్ద సినిమా కాబట్టి ఎవరూ కూడా చిత్ర యూనిట్ ని గట్టిగా అడగలేని పరిస్థితి. ఇక ఆ సినిమాతో పోటీ పడలేక మీడియం రేంజ్ సినిమాలు కూడా ఇప్పుడు మరొక డేట్ కోసం ఎదురుచూస్తున్నాయి. సలార్ ఎంత ఇంపాక్ట్ చూపించింది అంటే కేవలం డిసెంబర్ ను మాత్రమే కాకుండా ఆ తర్వాత జనవరి సినిమాలకు కూడా కన్ఫ్యూజన్ లో పడేసింది.
డిసెంబర్ కి రావాలనుకున్న మరికొన్ని సినిమాలు ఇప్పుడు జనవరి పై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతిని కూడా టార్గెట్ చేస్తున్నాయి. ఇక మొత్తానికే సలార్ సినిమా అయితే డిసెంబర్ 22వ తేదీన రాబోతున్నట్లు ఈరోజు అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. అయితే అదే రోజు అంతకంటే ముందు డిసెంబర్ 21వ తేదీన నాని హాయ్ నాన్న సినిమాను కూడా గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు.
దసరా సినిమాతో 100 కోట్ల బిజినెస్ చూసిన నాని ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ప్రమోట్ చేసి విడుదల చేయాలని ఆలోచనతో అయితే ఉన్నాడు. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్ సాంగ్స్ అన్ని కూడా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేస్తూ వచ్చారు. ఇక సలార్ వాయిదా పడింది అని తెలియగానే నాని సినిమా ముందుగా ఆలోచనలో పడింది.
ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామంటే అప్పుడు ముందే చాలా సినిమాలు బ్లాక్ చేసుకొని సిద్ధంగా ఉన్నాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గి మరొక డేట్ ఫిక్స్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 7వ తేదీన రావాలి అని ఇప్పుడు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ డేట్ కు అయితే పెద్దగా పోటీని ఇచ్చే సినిమాలు లేవు.
కనీసం రెండు వారాలపాటు ధియేటర్లో ఉన్నా కూడా సినిమాకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు డిసెంబర్ లోనే రావాలని అనుకుంటున్నాను వెంకటేష్ సైంధవ్ సినిమా కూడా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సలార్ తో పోటీకి డుంకి సినిమా మాత్రమే నిలబడే అవకాశం ఉంది.