ఉన్నంతలో అదుర్స్ అనిపించేలా మాస్ స్టఫ్ !
వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని లీడ్ రోల్ లో నటిస్తున్న సరిపోదా శనివారం సినిమాలో నాని మాస్ స్టఫ్ అదిరిపోతుందని తెలుస్తుంది.
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ఇప్పుడు టాప్ గేర్ లో నడుస్తుంది. చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు నమోదు చేసుకుంటున్నాయి. అందుకే నాని సినిమా అనగానే బిజినెస్ ఇట్టే జరిగిపోతుంది. లాస్ట్ ఇయర్ రెండు హిట్లు ఇచ్చిన నాని ఈ ఇయర్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. ఐతే ఈ నెల చివరన సరిపోదా శనివారం అంటూ వచ్చి మరోసారి తన సత్తా చాటబోతున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని లీడ్ రోల్ లో నటిస్తున్న సరిపోదా శనివారం సినిమాలో నాని మాస్ స్టఫ్ అదిరిపోతుందని తెలుస్తుంది.
సినిమా టీజర్ లోనే వారం మొత్తం ఏం జరిగినా హీరో శనివారం మాత్రమే రివెంజ్ తీర్చుకుంటాడు. అంటే హీరోకి శనివారం మాత్రమే కోపం వస్తుంది అన్నమాట. వెరైటీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో నాని ఆ ఒక్క శనివారం రోజు చూపించే యాక్షన్ ట్రీట్ మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు. అవసరమైన టైం లో అవసరమైన విధంగా ఫైట్స్ ఉంటే ఆడియన్స్ ఎట్రాక్ట్ అవుతారు. సినిమాలో వాళ్లు ఇన్వాల్వ్ అయ్యి హీరో ఇక్కడ కొట్టేస్తే బాగుండు అనిపిస్తే చాలు హీరో రెచ్చిపోతాడు.
సో అలా సరిపోదా శనివారం సినిమా చూడటానికి నాని మార్క్ క్లాస్ సినిమాగా ఉన్నా లోపల స్టఫ్ మాత్రం మాస్ అంశాలతో నింపేస్తున్నాడట డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. డైరెక్టర్ కెరీర్ లో కూడా భారీ యాక్షన్ సినీమా కూడా ఇదే అని చెప్పొచ్చు. నాని సరిపోదా శనివారం ఫ్యాన్స్ కే కాదు సినీ ప్రియులకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అంటున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా తర్వాత నాని ప్లానింగ్ కూడా ఒక రేంజ్ లో ఉంది. నాని నెక్స్ట్ సినిమా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇక సుజిత్ డైరెక్షన్ లో ఒక సినిమా ప్లాన్ చేసినా అదేదో బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిందని టాక్. సో సరిపోదా శనివారం రిలీజ్ అయ్యే సరికి నాని నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.