టాప్ గేర్ లో నాని.. ఇది ఎవరు ఊహించలేదుగా..?

సరిపోదా శనివారం ఆ నెక్స్ట్ వచ్చే సినిమాలు రెండు కూడా పాన్ ఇండియా అటెంప్ట్ అని తెలుస్తుంది. మరి ఈ సినిమాలు నానికి ఎలాంటి రిజల్ట్ అందిస్తాయన్నది చూడాలి.

Update: 2024-02-27 02:45 GMT

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ టాప్ గేర్ వేశాడని చెప్పొచ్చు. దసరా సినిమాకు ముందు నాని సినిమాల కమిట్మెంట్ వేరేలా ఉండేది. ఎప్పుడైతే దసరాలోని ధరణి పాత్రతో తన మాస్ యాంగిల్ తో ప్రేక్షకులను మెప్పించాడో అప్పుడే నాని కూడా టైర్ 2 నుంచి స్టార్ రేంజ్ కి ఎదిగాడని ప్రూవ్ చేశాడు. దసరా సినిమాలో నాని తన సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ చేశాడు. అయితే ఆ సినిమా విషయంలో నాని తీసుకున్న నిర్ణయం అతన్ని ఒక మెట్టు ఎక్కేలా చేసింది.

కెరీర్ లో ప్రతి హీరోకి 100 కోట్ల మార్క్ అనేది ఒక కల. దసరాతో నాని కూడా ఆ మార్క్ రీచ్ అయ్యి తన సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ తన మార్క్ సినిమా హాయ్ నాన్న సినిమాతో కూల్ హిట్ అందుకున్నాడు. నాని నెక్స్ట్ సరిపోదా శనివారం కూడా తనలోని మాస్ యాంగిల్ ని మరోసారి చూపించేందుకు ఫిక్స్ అయ్యాడు. దసరాతో తనపై తనకు వచ్చిన కాన్ఫిడెన్స్, తను యాక్షన్ సినిమాలు చేసిన ఆడియన్స్ చూస్తారనే నమ్మకం రెండిటినీ బిల్డ్ చేసుకున్నాడు. అందుకే సరిపోదా శనివారం టీజర్ తోనే మాస్ ఫీస్ట్ అందించడం పక్కా అని చూపించాడు.

ఈ సినిమా తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో మరో క్రేజీ సినిమా చేస్తున్నాడు. పవర్ తర్వాత లవర్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా వస్తుండగా సాహో, OG తర్వాత సుజిత్ చేస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు అదిరిపోయాయి. నాని సినిమాల ప్లానింగ్ చూస్తే కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అనిపిస్తుంది. నిన్న మొన్నటిదాకా తన సినిమాలనీ 40 నుంచి 50 కోట్ల గ్రాస్ దాకా తెచ్చుకున్న నాని ఇక మీదట టార్గెట్ 100 కోట్లు అన్నట్టుగా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. సరిపోదా శనివారం ఆ నెక్స్ట్ వచ్చే సినిమాలు రెండు కూడా పాన్ ఇండియా అటెంప్ట్ అని తెలుస్తుంది. మరి ఈ సినిమాలు నానికి ఎలాంటి రిజల్ట్ అందిస్తాయన్నది చూడాలి.

ఈ రెండు సినిమాల తర్వాత నాని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనే మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. ఆ సినిమాకు సంబందించిన న్యూస్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. సరిపోదా శనివారం ఈ ఆగష్టుకి వస్తుండగా ఆ తర్వాతే సుజిత్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సో శ్రీకాంత్ ఓదెల తో సినిమా 2025 సెకండ్ హాఫ్ లోనే ఉండే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News