నాని సినిమాకు.. మెగా టెన్షన్

నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీ ఆగష్టు 29న పాన్ ఇండియా లెవల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది

Update: 2024-07-26 14:59 GMT

నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీ ఆగష్టు 29న పాన్ ఇండియా లెవల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని వివేక్ తెరకెక్కించారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి. ఈ చిత్రంలో వారం రోజులు వచ్చే కోపాన్ని ఒకే రోజు చూపించే వ్యక్తిగా నాని కనిపిస్తున్నాడు. సినిమాలో ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య నటించాడు.

అతని పాత్ర మూవీలో పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని నుంచి వస్తోన్న సినిమా కావడంతో మినిమమ్ గ్యారెంటీ అనే అభిప్రాయం పబ్లిక్ లో ఉంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కమర్షియల్ సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

సరిపోదా శనివారం సినిమాకి ఇప్పుడు కొత్త తలనొప్పి ఎదురవుతోంది. రీ రిలీజ్ ట్రెండుతో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ మూవీ రిలీజ్ కి ముందు మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ 'ఇంద్ర' సినిమాను వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున రీరిలీజ్ చేయబోతోంది. ఆగస్టు 22న ఇంద్ర సినిమాని ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కనీసం వారం రోజులు రన్ టైం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రీరిలీజ్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చని అనుకోవచ్చు.

కానీ మెగాస్టర్ చిరంజీవి కాబట్టి కొత్త టెన్షన్ ఉంటుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాని కూడా సెప్టెంబర్ మొదటి వారంలో ఆయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. జనసేన ఎన్నికలలో గెలుపు తర్వాత పవర్ స్టార్ నుంచి థియేటర్స్ లో వస్తోన్న మూవీ కాబట్టి ఫ్యాన్స్ సందడి ఉంటుంది. రీరిలీజ్ అయిన ఈ సినిమాకి ఆదరణ ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల మధ్యలో సరిపోదా శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

డివివి దానయ్య నిర్మాణంలో వస్తోన్న మూవీ కాబట్టి థియేటర్స్ పరంగా పెద్ద టెన్షన్ లేకపోయిన సినిమా కలెక్షన్స్ పైన పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా అనే సందేహాలు ఉన్నాయి. అయితే నాని సినిమాలకి యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరి నుంచి ఆదరణ ఉంటుంది. అందుకే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ని ఎవరు ఆపలేరని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News