కాశ్మీర్ ఫైల్స్, గదర్ 2 విజయాలు డిస్ట్రబ్ చేస్తున్నాయ్
ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి ఆఫ్ బీట్ చిత్రాలు, గదర్ 2 లాంటి కమర్షియల్ సినిమా ఎలాంటి విజయాల్ని సాధించాయో చూసాం
ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి ఆఫ్ బీట్ చిత్రాలు, గదర్ 2 లాంటి కమర్షియల్ సినిమా ఎలాంటి విజయాల్ని సాధించాయో చూసాం. ఆయా సినిమాల కథలకు దాయాది పాకిస్తాన్ కనెక్షన్ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కుట్రల నేపథ్యం.. భారతీయుల హీరోయిక్ ఎలివేషన్ తో ఎలాంటి సినిమా వచ్చినా దానిని భారతీయులు ఆదరిస్తారనడానికి ఈ సినిమాలు పెద్ద ఉదాహరణ. అయితే ఈ విజయాలను తనని డిస్ట్రబ్ చేస్తున్నాయని ప్రకటించారు లెజెండరీ నటుడు నసీరుద్దీన్ షా. కొన్ని అసత్యాలు సత్యాలుగా తెరపై ప్రచారం చేశారనే ఆవేదనను కూడా ఆయన పరోక్షంగా వెలిబుచ్చారు. అసత్య కథలతో తెరకెక్కిన చిత్రాల ప్రజాదరణపై షా తన నిరాశను వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ జింగోయిస్టిక్ లేదా విభజన గురించి వర్ణిస్తూ సాగే ఈ చిత్రాలు ఇంతగా ప్రజాదరణ పొందడం కలవరపాటుకు గురి చేసిందని, అయితే నేటి కాలపు సత్యాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించే చిత్రాలేవీ రాలేదని నిరాశను వ్యక్తపరిచారు. పైన చెప్పిన సినిమాలు డిస్ట్రబ్ చేశాయని అన్నారు.
ఇప్పుడు మీరు ఎంత జింగోయిస్ట్‌గా ఉన్నారో అంతగా ప్రజాదరణ పొందారు. ఎందుకంటే ఇదే ఈ దేశాన్ని పాలిస్తోంది. మీ దేశాన్ని ప్రేమిస్తే సరిపోదు కానీ దాని గురించి ఢంకా బజాయించి మీరు ఊహాత్మక శత్రువులను సృష్టించుకోవాలి. వారు చేస్తున్నది చాలా హానికరమని ఈ వ్యక్తులు గ్రహించలేరు. నిజానికి, (ది) కేరళ స్టోరీ -గదర్ 2 వంటి సినిమాలు నేను చూడలేదు. కానీ వాటి గురించి నాకు తెలుసు. (ది) కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి అని అన్నారు. అయితే సుధీర్ మిశ్రా, అనుభవ్ సిన్హా , హన్సల్ మెహతా వారి కాలంలోని సత్యాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తే వాటిని ఇంతగా ఆదరించడం ఆందోళన కలిగించింది.. అని అన్నారు. నిజానికి ఈ సినిమాలు నేటి కాలానికి సరిపడినవి కాదనేది నసీరుద్దీన్ అభిప్రాయం.
మనం జీవిస్తున్న ప్రపంచంలోని వాస్తవికతను ప్రతిబింబించే చిత్రాలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్న ఔత్సాహిక దర్శకనిర్మాతలకు నసీరుద్దీన్ షా తన మద్దతును కూడా తెలియజేశారు. ఈ మేకర్స్ హృదయాన్ని కోల్పోకుండా కథలు చెప్పడం చాలా ముఖ్యం. వారు భావితరాలకు బాధ్యత వహిస్తారు. వంద సంవత్సరాల తర్వాత ప్రజలు 'భీద్'ని చూస్తారు. వారు 'గదర్ 2'ని కూడా చూస్తారు. మన కాలంలోని సత్యాన్ని ఎవరు చిత్రీకరించారో చూస్తారు. ఎందుకంటే సినిమా మాత్రమే అలా చేయగలుగుతుంది.. అని అన్నారు. జీవితాన్ని ఉన్నట్లుగా సంగ్రహించడం కష్టం. కాబట్టి రిగ్రెసివ్ అనేది ఏమి జరుగుతుందో అనేదానికి చాలా తేలికపాటి పదం. తప్పుడు విషయాలను ఎటువంటి కారణం లేకుండా తెరపై చూపకూడదు. కొన్ని సంఘాలను తగ్గించే విధంగా ఈ చిత్రాలను రూపొందించడానికి ఔత్సాహిక ఫిలింమేకర్స్ ఎక్కడ సహకరిస్తున్నారనేది భయంగా ఉంది. ఇది ప్రమాదకరమైన ధోరణి'' అని తన అభిప్రాయాన్ని ముగించాడు. వృత్తిపరమైన విషయాలకు వస్తే నసీరుద్దీన్ షా తన దర్శకత్వ వెంచర్ 'మ్యాన్ వుమన్' అనే షార్ట్ ఫిల్మ్ తో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. ఈ చిత్రంలో రత్న పాఠక్ షా కూడా నటించారు.