నాని భారీగా వరుస రిస్క్‌లు.. అద్భుతం జరగాల్సిందే!
దసరా వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నానిపై మరింత అంచనాలు పెరిగాయి.
దసరా వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నానిపై మరింత అంచనాలు పెరిగాయి. వాస్తవానికి ఆయన జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతారు. అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడాయన వరుసగా భారీ రిస్క్‌లు చేసేందుకు సిద్ధం అయిపోయారు. మరి అందులో నుంచి ఆయన సేఫ్‌గా బయటపడతారా లేదా బోల్తా కొడతారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
వివరాళ్లోకి వెళితే.. అష్టా-చమ్మా సినిమాతో అలరించినా, అంటే సుందరానికి! అంటూ నవ్వించినా, శ్యామ్ సింగరాయ్‌తో ఎమోషన్‌కు గురిచేసినా, దసరాతో ఎమోషనల్ విత్ వైలెన్స్ ఎక్స్పెరిమెంట్ చేసినా.. అది హీరో నానికే చెల్లింది. చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించే ఈ హీరో.. ప్రస్తుతం కెరీర్లో వైవిధ్యమైన పాత్రలతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ముందుకెళ్తున్నారు.
ప్రస్తుతం ఆయన హాయ్ నాన్న అనే క్లాస్ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్గా వివేక్ ఆత్రేయతో ఓ యాక్షన్ ఫిల్మ్ అనౌన్స్ చేశారు. తమిళ దర్శకుడు డాన్ ఫేమ్ సిబి చక్రవర్తితోనూ ఓ సినిమా చర్చల దశలో ఉంది. ఈ మూడు చిత్రాల రిజల్ట్.. కేవలం కంటెంట్, నాని బ్రాండ్ మీదే ఆధారపడి ఉన్నాయి.
ఒక మాస్ ఫిల్మ్ యావరేజ్ కంటెంట్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ మంచి వసూళ్లను అందుకోగలదు. మంచి బిజినెస్ కూడా చేస్తుంది. కానీ క్లాస్ ఫిల్మ్స్ అలా కాదు. సాంగ్స్, ప్రోమోస్, కంటెంట్, యాక్టింగ్ అన్నీ బాగా వర్కౌట్ అయితేనే మంచి టాక్ వస్తుంది. బిజినెస్ జరుగుతుంది. అయితే నాని ఒప్పుకున్న మూడు చిత్రాల దర్శకులకు ఆడియెన్స్‌లో పెద్దగా గుర్తింపు, బ్రాండ్ ఏమీ లేదు. కాబట్టి ఈ చిత్రాల బిజినెస్, కలెక్షన్లు.. కంటెంట్, నాని బ్రాండ్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఇక ఈ చిత్రాలన్నీ హిట్ అవ్వాలంటే ఏదో ఒక అద్భుతమే జరగాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఇదంతా చూస్తుంటే హీరో నాని పెద్ద రిస్కే చేయబోతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటాయో..