'స్కంద'.. హుషారైన బీట్ సాంగ్ వచ్చేసిందోచ్

శ్రోతల ను ఆకట్టుకునేలా వాటిని తీర్చిదిద్ది మూవీ ప్రమోషన్స్ లో రిలీజ్ చేస్తుంటారు. తాజాగా 'స్కంద' సినిమా నుంచి కూడా ఓ అదిరిపోయే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Update: 2023-08-03 05:09 GMT

ఒక్క సాంగ్ హిట్ అయితే చాలు.. దాని ద్వారా సినిమా కు కావాల్సిన హైప్‌ వచ్చేసినట్టే. అందుకే సాంగ్స్ పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరిస్తుంటారు మేకర్స్. శ్రోతల ను ఆకట్టుకునేలా వాటిని తీర్చిదిద్ది మూవీ ప్రమోషన్స్ లో రిలీజ్ చేస్తుంటారు. తాజాగా 'స్కంద' సినిమా నుంచి కూడా ఓ అదిరిపోయే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

డైన‌మిక్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను- రామ్ పోతినేని క‌లిసి చేస్తున్న భారీ యా న్ ఎంటర్ టైనర్ చిత్రమిది. ఈ చిత్రం పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతోంది. అందుకే 'నీ చుట్టూ చుట్టూ' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన డ్యాన్స్ లతో ఉర్రూతలూగిస్తుంటారు. ఈ మధ్య సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ధమాకాతో తన డ్యాన్స్ ఎట్టా ఉంటుందో ఇప్పటికే అభిమానుల కు రుచి చూపించింది. ఇప్పుడు వీరిద్దరు కలిసే ఈ తాజా లిరికల్ సాంగ్ లో చిందులేశారు.

ఈ సాంగ్ మొత్తంగా ఫుల్ క్లాస్ అండ్ స్టైలిష్ గా చిత్రీకరించారు. కలర్ ఫుల్ గా వేసిన ఖరీదైన సెట్ లో ఈ పాటను షూట్ చేశారు. అయితే ఇందులో శ్రీలీల పెద్దగా స్టెప్పులు వేయలేదు. కానీ ఎంతో గ్లామర్ గా కనిపించింది. సాంగ్ మొత్తం రామ్ నే హైలైట్ చేస్తూ చిత్రీకరించారు. ఆయన తన ఫున్ ఎనర్జీతో క్లాస్ అండ్ స్టైలిష్ గా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. మేకింగ్, టేకింగ్, హీరో హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా బాగుంది. యూత్ కు కనెక్ట్ అయ్యేలానే హుషారుగా సాగిందీ బీట్ సాంగ్. ఈ ఎనర్జిటిక్ సాంగ్ కు తమన్ అందించిన క్లాస్ బీట్ ఆకట్టుకుంటోంది.

ఇకపోతే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15వ తేదీన పాన్ ఇండియా స్థాయి లో రిలీజ్ చేయనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ ‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా ను నిర్మించారు. మరి వరుస ఫ్లాపులతో ఉన్న రామ్ కు ఈ సినిమా హిట్ తెచ్చి పెడుతుందేమో చూడాలి.

Full View
Tags:    

Similar News