పిక్ టాక్ : నమ్మండి నిజంగానే ఈమె 'దిల్‌' బ్యూటీ

దిల్‌ సినిమాలో కామెడీతో పాటు ప్రతి ఒక్కటి కూడా బాగా ప్రేక్షకులను అలరించాయి. అందుకే దిల్‌ హిట్‌ అయ్యింది

Update: 2024-07-03 10:51 GMT

నితిన్‌ కెరీర్‌ ఆరంభంలో యాక్షన్‌ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌ దర్శకత్వంలో చేసిన 'దిల్‌' సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ఫుల్‌ టైమ్‌ నిర్మాతగా మారిన రాజు ఆ తర్వాత నుంచి దిల్‌ రాజు గా మారి ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్ నిర్మాతగా కొనసాగుతున్నాడు.

దిల్‌ సినిమాలో కామెడీతో పాటు ప్రతి ఒక్కటి కూడా బాగా ప్రేక్షకులను అలరించాయి. అందుకే దిల్‌ హిట్‌ అయ్యింది. నితిన్‌ మరియు హీరోయిన్‌ నేహా బాంబ్‌ మధ్య ఉండే లవ్‌ అండ్‌ రొమాన్స్ కూడా చక్కగా పండింది. అందుకే దిల్‌ సినిమా అంతటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు దిల్‌ విషయం ఎందుకు అంటారా... అసలు విషయం ఏంటి అంటే దిల్‌ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన నేహా ఆ తర్వాత కొన్నాళ్లు కనిపించి ఆ తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యింది. సోషల్‌ మీడియాలో కూడా అడపా దడపా కనిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో దిల్‌ బ్యూటీ నేహా బాంబ్‌ షేర్ చేసిన ఫోటోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నిజంగానే ఈమె దిల్‌ సినిమాలో నితిన్ తో కలిసి నటించిందా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకుండా ఉన్నాం అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నేహా బాంబ్‌ గతంలో చేసిన సినిమాల నుంచి కొన్ని స్క్రీన్‌ షాట్స్ తీసి, ప్రస్తుత లుక్‌ తో జత చేసి చూస్తే అసలు పోలికే లేదు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అప్పటికి ఇప్పటికి సంబంధం లేనట్లుగా ఉన్నా కూడా, ఇప్పుడు కూడా చాలా అందంగా హీరోయిన్‌ స్థాయిలో ఉన్నారని, మళ్లీ సినిమాల్లో ప్రయత్నిస్తే బాగుంటుందని కొందరు సలహా ఇస్తున్నారు.

Tags:    

Similar News

eac