టాలీవుడ్ కి కొత్త రౌడీలు వస్తున్నారోచ్..!
కానీ ఇప్పుడు టాలీవుడ్ లో మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది విలన్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు.
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల కి పెద్దగా ఛాన్స్ లు రావు. స్టార్ హీరోలందరూ కూడా పరభాష హీరోయిన్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో దాదాపు అందరూ కూడా తెలుగేతర అమ్మాయిలు అనే విషయం తెల్సిందే. హీరోయిన్స్ మాత్రమే కాకుండా విలన్స్ కూడా ఎక్కువ శాతం పరభాష కు చెందిన వారే ఉన్నారు.
జగపతిబాబు, రావు రమేష్ లతో పాటు కొందరు తెలుగు విలన్స్ సినిమాల్లో సందడి చేస్తున్నారు. కానీ ఎక్కువ శాతం మాత్రం ఇతర భాషలకు చెందిన విలన్స్ తెలుగు సినిమాల్లో నటించారు, నటిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరోలు విలన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
ఆ మధ్య తమిళ్ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు విలన్ వేశాలతో ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది విలన్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. తాజాగా మరో కొత్త విలన్ తెలుగు సినీ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు.
ఫహద్ ఫాసిల్ అక్కడ హీరోగా చేస్తూ వరుసగా విలన్ పాత్రలు చేస్తున్నాడు. మరో వైపు పృథ్వీరాజ్ కూడా టాలీవుడ్ లో విలన్ వేషాలకు ఆసక్తి చూపిస్తున్నాడు. వీరి దారిలోనే మరో ఇద్దరు ముగ్గురు మలయాళ స్టార్స్ కూడా టాలీవుడ్ లో రౌడీలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మొత్తానికి బాలీవుడ్ మరియు మాలీవుడ్ నుంచి కొత్త విలన్ లు రావడంతో తెలుగు సినిమా పరిశ్రమ కొత్త కల సంతరించుకున్నట్లయింది అంటున్నారు.