వీడియో: వైన్ వొల‌క‌బోస్తూ నైట్ పార్టీలో నియా శ‌ర్మ ర‌చ్చ‌

బుల్లితెర ఆడియెన్ కి నియా శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామ నిరంత‌ర పార్టీ లైఫ్ గురించి కూడా ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇవ్వాల్సిన ప‌ని లేదు

Update: 2023-12-25 04:32 GMT

బుల్లితెర ఆడియెన్ కి నియా శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామ నిరంత‌ర పార్టీ లైఫ్ గురించి కూడా ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇవ్వాల్సిన ప‌ని లేదు. టీవీ ప‌రిశ్ర‌మ నుంచి ఎంతో యాక్టివ్ గా ఉండే నియా శ‌ర్మ‌.. నిరంత‌రం త‌న స్నేహితుల‌తో నైట్ పార్టీల్లో చేసే సంద‌డికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోష‌ల్ మీడియాల్లో దుమారం రేపుతూనే ఉన్నాయి.

తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. నియా శ‌ర్మ రెడ్ హాట్ లుక్ లో పార్టీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. అది కూడా త‌న స్నేహితురాలు క్రిస్టిల్ డి సౌజాతో కలిసి ఈ పార్టీలో సందడి చేసింది. ఇది న‌టుడు ర‌విదూబే బ‌ర్త్ డే పార్టీ. క్రిస్మ‌స్ కావ‌డంతో సంద‌డి పీక్స్ కి చేరుకుంది. ఈ పార్టీలో చేతిలో వైన్ గ్లాస్ తో నియా శ‌ర్మ‌- క్రిస్టిల్ డ్యాన్స్ ఫ్లోర్ పై నాగిని నృత్యం చేయ‌డంతో అది ఇప్పుడు వైర‌ల్ గా మారింది. నియా షైలెస్ పార్టీ గాళ్. క్రిస్టిల్ అంత‌కుమించి చెల‌రేగిపోయింది. నియా పొట్టి ప‌రికిణీ ఈ పార్టీలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా, క్రిస్టిల్ థై స్లిట్ బ్లాక్ డ్రెస్ వేడెక్కించింది.

నియా శర్మ ఇటీవ‌లే దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫాలో హాటెస్ట్ ఫోటోషూట్ తో మ‌తులు చెడ‌గొట్టింది. ఇంత‌లోనే ఇప్పుడు మ‌రో కొత్త వీడియో దుమ్ము లేపుతోంది. ఈ బ్యూటీ 2010లో 'కాళి ఏక్ అగ్నిపరీక్ష'తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై వంటి షోలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. రవి దూబే - నియా జంట షో జమై రాజా పెద్ద విజ‌యం సాధించింది. నియా ఖత్రోన్ కే ఖిలాడీ -ఝలక్ దిఖ‌లాజా వంటి రియాల్టీ షోలలో కూడా పాల్గొంది. బుల్లితెర రంగంలో ద‌శాబ్ధం పైగానే కెరీర్ ని విజ‌య‌వంతంగా న‌డిపించిన నియా శ‌ర్మ కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉంది.

Tags:    

Similar News