వరలక్ష్మి భర్త నిజంగా గ్రేట్ గురూ...!
సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే నికోలాయ్ సచ్‌దేవ్ ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.
తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే నటిగా సౌత్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత టాలీవుడ్ ఇతర భాషల్లో ముఖ్య పాత్రల్లో, విలన్ పాత్రల్లో నటించడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంది.
సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే నికోలాయ్ సచ్‌దేవ్ ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు శరత్ కుమార్ ఫ్యామిలీతో పాటు సచ్‌దేవ్ ఫ్యామిలీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ మరియు నికోలాయ్ సచ్‌దేవ్ ల వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి మరియు రిసెప్షన్ వేడుకలకు టాలీవుడ్, కోలీవుడ్ నుండే కాకుండా ఉత్తరాది నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యి కొత్త వధువరులను ఆశీర్వదించారు.
సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయి పేరు మారుతుంది. కానీ నికోలాయ్ సచ్‌దేవ్ మాత్రం తన పేరును మార్చుకోబోతున్నట్లుగా ప్రకటించాడు. తన పేరును నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచ్‌దేవ్ గా మార్చుకుంటున్నట్లుగా అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
సోషల్ మీడియాలో నికోలాయ్ చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమకు పుట్టబోయే పిల్లలకు కూడా వరలక్ష్మి పేరు ఉంటుందని ఆయన ప్రకటించాడు. ఈ విషయంలో వరలక్ష్మి చాలా అదృష్టవంతురాలు అని, ఇలాంటి భర్త దొరకడం ఆమె అదృష్టం అంటూ, నికోలాయ్ నువ్వు గ్రేట్ బాస్ అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.