'రాజాసాబ్' నిధి పాత్ర గురించి..!
మారుతి వంటి చిన్న దర్శకుడితో ప్రభాస్ సినిమా ఎలా ఒప్పుకున్నాడు అని విమర్శించిన వారే ఇప్పుడు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్' సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించినా షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఏడాది జూన్ లేదా జులై నెలలో సినిమాను విడుదల చేయాలని మారుతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా సినిమాలోని ప్రభాస్ లుక్ విడుదలైన ప్రతిసారి అంచనాలు ఆకాశాన్ని తాకుతూనే ఉన్నాయి. మారుతి వంటి చిన్న దర్శకుడితో ప్రభాస్ సినిమా ఎలా ఒప్పుకున్నాడు అని విమర్శించిన వారే ఇప్పుడు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న రాజాసాబ్ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది లు హీరోయిన్స్‌గా ప్రభాస్‌కి జోడీగా కనిపించబోతున్నారు. అయితే ముగ్గురి పాత్రలు ఏంటీ, వారితో ప్రభాస్ సన్నివేశాలు ఎలా ఉంటాయి అంటూ అంత ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మాళవిక మోహనన్ పాత్ర గ్లామర్‌గా ఉంటుందని, సినిమాలో ఆమె లీడ్ రోల్‌లో కనిపిస్తుందనే వార్తలు వచ్చాయి. ఇక తాజాగా నిధి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. తన పాత్ర గురించి సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు తాను చేసిన గ్లామర్ పాత్రలను ప్రేక్షకులు ఆధరించారు. తన నుంచి ప్రేక్షకులు ఎక్కువగా మళ్లీ మళ్లీ అలాంటి పాత్రలనే ఆశిస్తున్నారు. కానీ రాజాసాబ్‌లో మాత్రం అలాంటి పాత్ర చేయడం లేదు. పూర్తిగా విభిన్నంగా తాను కనిపించబోతున్నాను. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్‌లో కనిపించిన నిధి అగర్వాల్ ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్‌లో కనిపించడంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలోని తన పాత్రను చూసి ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్ అవుతారని, ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు తన మీద ఉన్న అభిప్రాయంను మార్చుకుంటారనే నమ్మకంను ఆమె వ్యక్తం చేసింది.
సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా వరల్డ్ బిగ్గెస్ట్ హర్రర్ కామెడీ సినిమా అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. బాలీవుడ్ నిర్మాత భూషన్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది హ్యారీ పోర్టర్‌కి తగ్గకుండా ఉంటుందని నమ్మకం పెరిగేలా వ్యాఖ్యలు చేశారు. మారుతి నుంచి రాబోతున్న మొదటి హర్రర్ సినిమా ఇదే కావడంతో ఫలితం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.