స్వర్గం నుండి వచ్చిన మాగ్నోలియా పువ్వు
పెళ్లి వేడుక ఆద్యంతం సందడి చేస్తూ, ఫోటోషూట్లలో ఎంతో వైభవంగా మైమరిపించింది.
నిహారిక కొణిదెల.. పరిచయం అవసరం లేదు. మెగా ప్రిన్సెస్‌గా అభిమానులు ఆరాధిస్తారు. నటిగా, యాంకర్ గా, నిర్మాతగా .. ఆల్ రౌండర్ పనితనం కనబరిచిన నిహారిక వ్యక్తిగత జీవితంలో కొన్ని ఎపిసోడ్ల గురించి అభిమానులకు స్పష్ఠంగా తెలుసు. అదంతా అటుంచితే ఇటీవల తన సోదరుడు వరుణ్ తేజ్ పెళ్లిలో ఎంతో ఆనందంగా తేజోవంతంగా కనిపించింది నీహారిక. పెళ్లి వేడుక ఆద్యంతం సందడి చేస్తూ, ఫోటోషూట్లలో ఎంతో వైభవంగా మైమరిపించింది.
ఆ తర్వాత కూడా వరుస ఫోటోషూట్లతో అభిమానుల ముందుకు వస్తోంది. తాజాగా నిహారిక బ్లూ డిజైనర్ ఫ్రాక్ లో తళతళా మెరిసిపోతున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ లుక్ లో నిహారిక మునుపటి కంటే స్పెషల్ గా ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బ్లూ డ్రెస్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక అభిమాని.. ``బ్లూ కాదు మేడమ్ .. ఇది చాలా హా*`` అని అన్నాడు. అంత నీలిరంగు లేదు అని కూడా ఒకరు వ్యాఖ్యానించారు. ``వావ్ మీరు స్వర్గం నుండి వచ్చిన మాగ్నోలియా పువ్వులా ఉన్నారు.. బృహస్పతి యురేనస్ మెర్క్యురీ నెప్ట్యూన్.. ప్లూటో తాజే కేర్ హ్యాపీ వీకెండ్`` అని ఒక అభిమాని కవిత అల్లాడు.
నిహారిక అందచందాలకు ఫిదా అయిపోయిన ఉపేంద్ర యాదవ్ పిళ్లై అనే యువకుడు సోషల్ మీడియాల్లో ఒక అడుగు ముందుకు వేసి నిహారికను ఆరాధిస్తున్న కవితలు షేర్ చేసాడు. ఏది ఏమైనా నిహారికను తిరిగి ఆరాధించేవారు అంతకంతకు పెరుగుతున్నారు. ఒక అభిమాని అయితే నిహారిక తిరిగి నటించాలని ఎంతో ప్రాధేయపడుతూ అడిగాడు. పలువురు అతడిని అనుసరిస్తూ నిహారిక తిరిగి నటనలోకి రావాలని కోరారు. నిహారిక నటనను విరమించలేదు. అడపాదడపా నటిస్తోంది. అయితే తను సీరియస్ గా నటనా కెరీర్ లో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. మునుముందు నిహారిక ఏదైనా పెద్ద తెర ప్రయత్నంతో టచ్ లోకి వస్తుందేమో చూడాలి.