ఏనుగుతోనే మెగా ప్రిన్సెస్ పరిహాసమా?
ఏనుగుకు ఆహారం ఇవ్వడం.. స్నానానికి సహాయం చేయడం వంటి పనిలో నిహారిక ఎంతో ఆనందాన్ని అనుభవించింది
ఏనుగు తోక గిల్లినా, తేడాగా తొండంపై టచ్ ఇచ్చినా ఏం జరుగుతుందో తెలుసు కదా! కానీ అలాంటి పనులన్నీ సునాయాసంగా చేసేసినట్టే కనిపిస్తోంది మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల. ఏనుగుతో నిహారిక ఫోటషూట్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇటీవలే నిహారిక 'అడెలైన్ హిల్ ట్రిప్' నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. ఇవి సోషల్ మీడియాల్లో విజువల్ ఫీస్ట్ గా మారాయి.
ఈ ఫోటోషూట్ లో మెగా ప్రిన్సెస్ అందమైన మనసు ఆవిష్కృతమైంది. వన్యప్రాణుల పట్ల తనకున్న ప్రేమను ప్రదర్శిస్తూ నిహారిక ఒక రోజు ఏనుగు సంరక్షణ దినచర్యలో చురుకుగా పాల్గొంది. ఏనుగుల రక్షణను నిర్ధారించే లక్ష్యంతో అవసరమైన వేట పద్ధతులను కూడా నిహారిక నేర్చుకుంది. అరణ్యంలో ఆహారాన్ని తయారు చేయడంలో నైపుణ్యాన్ని సంపాదించి అక్కడివారి జీవనశైలిని అర్థం చేసుకుంది.
ఏనుగుకు ఆహారం ఇవ్వడం.. స్నానానికి సహాయం చేయడం వంటి పనిలో నిహారిక ఎంతో ఆనందాన్ని అనుభవించింది. భారీ అటవీ జంతువులపై తన ప్రేమను ఎంత మాత్రం దాచుకోలేదు. ఇక ఈ ఫోటోషూట్ లో నిహారిక అందమైన కల్మశం లేని నవ్వు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ యాత్రలో నిహారిక వెదురు తెప్ప రైడ్‌ని తిరిగి బేస్‌కి చేర్చడం ద్వారా తన డేను ముగించింది. నిహారిక ప్రస్తుతం సినిమాలకు సంతకాలు చేస్తోంది. మనోజ్ నటిస్తున్న 'వ్వాట్ ద ఫిష్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.