ప్రైవేట్ వీడియోస్ పై నిఖిల్ క్లారిటీ.. ఏమన్నారంటే?
అయితే మస్తాన్ హార్డ్ డిస్క్ లో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య తెలిపింది.
యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రీసెంట్ గా మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించినట్టు మస్తాన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అతడి హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే మస్తాన్ హార్డ్ డిస్క్ లో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిఖిల్ ప్రైవేట్ వీడియోస్.. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఆయన స్పందించారు.
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని నిఖిల్ తాజాగా ఖండించారు. తన కుటుంబసభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా కన్వే చేస్తున్నారని మండిపడ్డారు. రకరకాల వార్తలు సృష్టిస్తున్నారని, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఆ వీడియోలో ఉన్నది తన ఫ్యామిలీ మెంబర్స్ నేనని క్లారిటీ ఇచ్చారు.
కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీ వీడియోలను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఏదేమైనా పోలీసులకు మొత్తం తెలుసని అన్నారు. తన గురించి నిజమేంటో అబద్ధమేంటో పోలీసులకు తెలుసని చెప్పారు. అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం వివిధ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం స్వయంభూను పూర్తి చేస్తున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా వస్తున్న అందులో పోరాట యోధుడిలా కనిపించనున్నారు.
స్వయంభూ మూవీ కోసం 45 రోజుల పాటు మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ తదితర విద్యల్లో కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే స్వయంభూతోపాటు సుధీర్ వర్మతో ది ఇండియా హౌస్ సినిమా చేస్తున్నారు. స్టార్ హీరో రామ్ చరణ్ సమర్పణలో ఆ మూవీ రూపొందుతోంది. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కార్తికేయ 3ను తన లైనప్ లో చేర్చుకున్నారు నిఖిల్.