డబ్బుతో నన్ను కొనలేరు..
ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా రాబిన్‌హుడ్ లో ఓ చిన్న క్యామియో చేశారు.;

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్‌హుడ్ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. మార్చి 28న రిలీజ్ కానున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా రాబిన్‌హుడ్ లో ఓ చిన్న క్యామియో చేశారు.
ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ ఎడతెరిపి లేకుండా చేస్తూనే ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ డిఫరెంట్ గా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లింది. అందులో భాగంగానే రీసెంట్ గా వెన్నెల కిషోర్ తో నితిన్ హానెస్ట్ పాడ్‌కాస్ట్ ఫైనల్ పార్ట్ ను చేసి రిలీజ్ చేశారు.
ఈ పాడ్‌కాస్ట్‌లో వెన్నెల కిషోర్ తో నితిన్ ఫన్నీ రాపిడ్ ఫైర్ సెషన్ నిర్వహించి క్రేజీ క్వశ్చన్స్ అడిగాడు. అందులో మొదటిగా మీరు ప్రమోషన్స్ కు ఎందుకు రారని అడగ్గా, దానికి కిషోర్ ఇచ్చిన ఆన్సర్ చాలా కన్విన్సింగ్ గా ఉంది. కమెడియన్స్ నెలకు ఆరు సినిమాలు చేస్తారని, కానీ హీరోలు ఆరు నెలలకు ఒకటే సినిమా చేస్తారని చెప్పాడు.
మరి డబ్బులు ఇస్తే ప్రమోషన్స్ కు వస్తారా అని నితిన్ అడిగితే, డబ్బుతో మీరు నన్ను కొనలేరని అంటాడు కిషోర్. మరి ఇప్పుడు ఎలా వచ్చారు అంటే క్యాష్ ఇచ్చారని అనగానే వెంటనే నవ్వులు పూశాయి. హీరోలకు ఇచ్చినట్టే మీక్కూడా ట్యాగ్ లైన్ ఇస్తే మీకు మీరు ఏ ట్యాగ్ ఇచ్చుకుంటారని నితిన్ అడగ్గా దానికి వెన్నెల కిషోర్ నాట్ ఎట్ ఎ స్టార్ అనే ట్యాగ్ ను ఇచ్చుకుంటానని సమాధానమిచ్చాడు.
ఇలాంటి క్రేజీ, ఫన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ తో వెన్నెల కిషోర్ పాడ్‌కాస్ట్ ఆడియన్స్ ను బాగా అలరిస్తోంది. ప్రస్తుతం ఈ క్రేజీ పాడ్‌కాస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా, రాబిన్‌హుడ్ సినిమా తప్పకుండా ఆడియన్స్ ను అలరిస్తుందని, ప్రతీ ఒక్కరికీ ఈ మూవీ నచ్చుతుందని వెన్నెల కిషోర్ ఈ సందర్భంగా చెప్పా డు .