నితిన్ కొత్త మూవీ.. పోస్టర్ కాపీ కొట్టేశారా?

హిట్టయిన కాంబోలో మరో సినిమా వస్తుందంటే ఆ ప్రాజెక్ట్‌ పై ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు.

Update: 2024-01-24 02:30 GMT

హిట్టయిన కాంబోలో మరో సినిమా వస్తుందంటే ఆ ప్రాజెక్ట్‌ పై ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు. ఈ సారి మరెన్ని రికార్డులు కొల్లగొడతారో.. బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో కలెక్షన్ల వరద పారిస్తారో అని ఇప్పటి నుంచే అంచనాలు వేస్తుంటారు. అలాంటి క్రేజ్ ఉన్న నితిన్- వెంకీ కుడుముల కాంబో.. మూడేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.


లేటెస్ట్ గా మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. “అన్ మాస్కింగ్ ది కాన్ మ్యాన్” అంటూ జనవరి 26న ఉదయం 11:07 నిమిషాలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సిటీ బ్యాక్ డ్రాప్ లో ఎత్తైన బిల్డింగ్ పై శాంటా గెటప్ లో బ్యాగ్ తగిలించుకుని హీరో నిలబడి ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ పోస్టర్.. కాపీ కొట్టేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నొలన్ తెరకెక్కించిన డార్క్ నైట్ లో జోకర్ పోస్టర్ ను కాపీ చేశారని అంటున్నారు. అందులో బ్యాట్ మెన్ షూట్ వేసుకోగా.. ఇందులో నితిన్ శాంటా గెటప్ లో ఉన్నారని చెబుతున్నారు. అదొక్కటే తేడా అని అంటున్నారు. మరి ఈ కాపీ పోస్టర్ అంటూ వస్తున్న కామెంట్లపై మేకర్స్ స్పందిస్తారేమో చూడాలి.

#VN2 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తొలుత VNRTrioగా మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. నేషనల్ క్రష్ రష్మిక కూడా నటిస్తుండడంతో ఇలా అనౌన్స్మెంట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేయలేక రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో #VNRTrio కాస్త #VN2గా మారిపోయింది. శ్రీలీల, కృతి శెట్టి పేర్లు హీరోయిన్ కేటగిరిలో వినిపిస్తున్నాయి కానీ మేకర్స్ నుంచి మాత్రం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

నితిన్.. ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ అందుకోలేకపోతున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ తో థియేటర్లలోకి వచ్చారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు సాలిడ్ సక్సెస్ కోసం తనకు భీష్మతో సూపర్ హిట్ ఇచ్చిన పాత దర్శకుడినే నమ్ముకున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News