రియల్ గోల్డ్ ఛాన్స్ రాముడికి లేదా?
బాలీవుడ్ దర్శకుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయణం ఆధారంగా `రామాయణ్` ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ దర్శకుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయణం ఆధారంగా `రామాయణ్` ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో రణబీర్ కపూర్.. సీత పాత్రలో సాయి పల్లవి...రావణుడి పాత్రలో యశ్..హనుమంతుడి పాత్రలో దేవదత్ లాంటి స్టార్లతో భారీ కాన్సాస్ పై తెరకెక్కిస్తున్నారు. కుంభకర్ణుడి పాత్రలో బాబి డియోల్‌ని ఎంపిక చేసినట్లు ప్రచారంలో ఉంది. ఇంకా రామాయణంలో ఉన్న కీలక పాత్రలకు చాలా మంది ప్రముఖల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. రాముడికి సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇంకా లంకాధిపతి యశ్ జాయిన్ కాలేదు. అతి త్వరలోనే యశ్ కూడా సెట్స్ కి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ఆ పాత్రకి సంబంధించి నితీష్ తివారీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. రావణుడి పాత్రకు సంబంధించి పూర్తిగా నిజమైన భంగారు ఆభరణాలే వినియోగించాలని దర్శకుడు భావిస్తున్నడుట. నేచురల్ లుక్ రావాలంటే అది సహజమైన మేలిమి బంగారంతోనే సాధ్యమవుతుందని విశ్వశిస్తున్నారుట.
దీనిలో భాగంగా ఆభరణాలు అన్నింటిని ప్రత్యేకంగా తయారు చేయించాలని..మార్కెట్ లో దొరికే ఆభరణాలకంటే తయారు చేయిస్తే మరింత వైభవంగా ఆ పాత్రని హైలైట్ చేయడానికి సహాయపడుతుందని భావిస్తున్నారుట. ఇక్కడ మరో బలమైన రీజన్ కూడా తెరపైకి వస్తోంది. రావణుడు లంకాధిపతి. లంక అంతా బంగారంతో నిర్మితమై ఉంటుందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. అందమైన లంక సిద్దమవ్వవాలన్నా? ఆపాత్రలో నటించే నటుడికి సహజ రూపం రావాలన్నా ఒరిజినల్ బంగారంతోనే సాధ్యం అని..బడ్జెట్ ఎక్కువైనా ఎక్కడా రాజీ పడొద్దని యూనిట్ ని ఆదేశించినట్లు సమాచారం.
మరి రియల్ గోల్డ్ ధరించే ఛాన్స్ శ్రీరాముడి పాత్రకి లేదో? ఏంటో? తెలియాలి మరి. సాధారణంగా సినిమా షూటింగ్ లో బంగారు ఆభరణాలు వాడాల్సి వస్తే నకిలీ గోల్డ్ వినియోగిస్తుంటారు. బాహుబలి సినిమాలో పాత్రలకు అలాంటి గోల్డ్ వాడారు. ఆహార్య పరంగా ఒకే గానీ...సహజ బంగారంలా నకిలీ గోల్డ్ మెరవలేదు. సినిమాలో ఇదో చిన్న తప్పిదంగానూ కనిపించింది. అలాంటి తప్పిదాలు ఎక్కడా దొర్లకుండా నితీష్ తివారీ ముందే జాగ్రత్త పడుతున్నాడు.