మొన్ననే 'గ్లోబల్ స్టార్' అన్నారు.. ఇంతలోనే మళ్లీ ఏమైంది?

ఈ నేపథ్యంలో ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న 'జరగండి జరగండి' పాటను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

Update: 2024-03-26 12:52 GMT
మొన్ననే గ్లోబల్ స్టార్ అన్నారు.. ఇంతలోనే మళ్లీ ఏమైంది?
  • whatsapp icon

RRR సినిమా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత, 'గ్లోబల్ స్టార్' ట్యాగ్ చుట్టూ సోషల్ మీడియాలో ఎంత పెద్ద ఫ్యాన్ వార్ జరిగిందో మనం చూశాం. ఈ టైటిల్ తమ హీరోకే సొంతమంటూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు నెట్టింట ఓ రేంజ్ లో రచ్చ చేశారు. అయితే చివరికి గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను చెర్రీకే అఫిషియల్ గా ఫిక్స్ చేశారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ, మళ్లీ ఎప్పటిలాగే చరణ్ కు 'మెగా పవర్ స్టార్' టైటిల్ నే తగిలించడం చర్చనీయాంశంగా మారింది.

 

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రాన్ని ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగా వారసుడి ట్యాగ్ ను 'గ్లోబల్ స్టార్' గా మార్చబడింది.

ఇప్పటి వరకూ చరణ్ ను 'మెగా పవర్ స్టార్' అని పిలుచుకుంటుండగా.. 'RC 16' సినిమాతో 'గ్లోబల్ స్టార్'గా ప్రెజెంట్ చేయబోతున్నట్లు ఒక వీడియోతో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో గత నాలుగు రోజులుగా దీని గురించే నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఇదే రామ్ చరణ్ కి సరైన టైటిల్ అని మెగా ఫ్యాన్స్ అంటుంటే, అదేం ట్యాగ్ అని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు 'గేమ్ చేంజర్' మేకర్స్ కూడా గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అయింది.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న 'జరగండి జరగండి' పాటను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. చెర్రీ బర్త్ డే స్పెషల్ గా రేపు (మార్చి 27) ఉదయం 9 గంటలకు పాట వస్తుందని చెబుతూ.. ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో వదిలారు. ఇందులో గ్లోబల్ స్టార్ అని కాకుండా, మెగా పవర్ స్టార్ అనే ప్రస్తావించడం మెగా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తోంది.

ఇప్పటికే 'గేమ్ చేంజర్' నుంచి కొత్త పోస్టర్ కాకుండా, రామ్ చరణ్ ఫ్రంట్ సైడ్ లుక్ తో పాత పోస్టర్ నే రిలీజ్ చేశారని అభిమానులు మేకర్స్ పై కాస్త గుర్రుగా వున్నారు. దీనికి తోడు ఇప్పుడు 'గ్లోబల్ స్టార్' అని కాకుండా పాత ట్యాగ్ నే వాడటంపై ఓ వర్గం ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ అన్ని అప్డేట్స్ లో 'మెగా పవర్ స్టార్' అనే పేర్కొంటున్నారు కాబట్టి ఇలా చేశారో, లేదా మరేదైనా కారణముందో తెలియదు కానీ.. నాలుగు రోజులు తిరక్కుండానే మళ్లీ పాత ట్యాగ్ కే రావడం యాంటీ ఫ్యాన్స్ కు ట్రోలింగ్ చేయడానికి అవకాశం కల్పించింది. మరి దీనిపై రానున్న రోజుల్లో దిల్ రాజు అండ్ టీమ్ వివరణ ఇస్తారేమో చూడాలి.

Tags:    

Similar News