పింక్ ఫెదర్లో చిక్కిన నోరా పక్షి
అసాధారణ ప్రతిభావంతురాలైన కెనడియన్ మొరాకో బ్యూటీ ఆల్ రౌండర్ నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
విభిన్నమైన వేషధారణలు, ఎనర్జిటిక్ పెర్ఫామెన్సెస్ తో నోరా ఫతేహి ఫ్యాషన్ గేమ్ లో ఎప్పుడూ శిఖరాగ్రాన నిలుస్తోంది. అసాధారణ ప్రతిభావంతురాలైన కెనడియన్ మొరాకో బ్యూటీ ఆల్ రౌండర్ నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నర్తకి, నటి, మోడల్ గా నోరా ఫతేహి వినోద పరిశ్రమలో ఎందుకు బలీయమైన శక్తి అనేది మరోసారి నిరూపించింది.
తాజాగా ప్రఖ్యాత లైఫ్‌స్టైల్ `ఏషియా మ్యాగజైన్` కవర్‌పై ప్రత్యక్షమైంది. నోరా ఫతేహి వైవిద్యమైన లుక్స్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు వెబ్ ని ముంచెత్తుతున్నాయి. నిజానికి నోరా ఫ్యాషన్ సెన్స్ తో పాటు, ఆన్-స్క్రీన్ వ్యక్తిత్వం ఆకర్షణీయమైనదని ఈ ఇంటర్వ్యూ విశదపరిచింది. నోరా తనను తాను షో స్టాపర్ గా నిలుపుకోవడం ఎలానో తెలిసిన భామ. ఈవెంట్ కి తగ్గట్టు స్టైలిష్‌గా ఎలా కనిపించాలో నోరాకు తెలుసు. ఆమె ఇటీవల లైఫ్‌స్టైల్ ఏషియా మ్యాగజైన్ కవర్‌పై సున్నితమైన గులాబీ రంగు ఫెదర్ దుస్తులతో కనిపించింది. మ్యాగజైన్ కవర్ విజువల్ ఫీస్ట్ గా మారింది. నోరాను ఈ ఫోటోషూట్ ఎంతో వైభవంగా ప్రదర్శించింది.
కవర్ ఫోటో కోసం, నోరా డిజైనర్ బ్రాండ్ ఫల్గుణి & షేన్ పీకాక్ నుండి స్టైలిష్ పింక్ జాకెట్‌ను ఎంచుకుంది. మినీడ్రెస్లో గులాబీ ఫెదర్ చెల్లాచెదురు అల్లికతో కనిపించింది. తెల్లటి అంచు కళ్లద్దాలు బల్గారీ సర్పెంటీ వాచ్ ని ధరించి నోరా అద్భుతమైన చిక్ టచ్ ఇచ్చింది. స్వరోస్కీ సిప్పర్ తో కూల్ గా కనిపించింది. నోరా తన జుట్టును సొగసైన అప్డోలో డిజైన్ చేసింది. ఐలైనర్, మెరిసే కళ్ళు, స్మోకీ మేకప్, పింక్ లిప్ టింట్ తో ఎంతో అందంగా కనిపించింది.
నోరా కెరీర్ మ్యాటర్ కి వస్తే... ఇంతకుముందు బాహుబలి లో మనోహరి ఐటమ్ పాటలో తనవైన డ్యాన్సింగ్ స్కిల్స్ తో మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి తెలుగు చిత్రం `మట్కా`లో నటిస్తోంది. ఖునాల్ ఖీమ్ము చిత్రం మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ లోను నటిస్తోంది. ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ, నోరా ఫతేహి, దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు.