వారంతా ఒక్కటే.. ఫ్యాన్స్ మాత్రమే అనవసరంగా..

తమ ఫేవరెట్ హీరో సినిమా అప్పుడు వారు అలా చేశారు కాబట్టి మేము కూడా ఇప్పుడు అలాగే చేస్తామన్నట్లు బిహేవ్ చేస్తున్నారు.

Update: 2024-09-12 18:01 GMT

సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్ ను చూస్తుంటే.. అసలేం జరుగుతోంది ఎందుకలా డిబేట్స్ పెట్టుకుంటున్నారు అర్థం పర్థం లేని వార్ ఎవరికోసం అని ఎవరికైనా కచ్చితంగా అనిపించకమానదు. పంతాలు.. పౌరుషానికి పోయి కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు. తమ ఫేవరెట్ హీరో సినిమా అప్పుడు వారు అలా చేశారు కాబట్టి మేము కూడా ఇప్పుడు అలాగే చేస్తామన్నట్లు బిహేవ్ చేస్తున్నారు.

అయితే గత రెండు రోజులుగా నెట్టింట అదే జరుగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ట్రైలర్.. రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మూడు నిమిషాల నిడివి కన్నా తక్కువ ఉన్న ట్రైలర్ తో మేకర్స్ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. తారక్ తన నట విశ్వరూపం చూపించారు. కొందరు మిక్స్ డ్ రివ్యూస్ ఇచ్చినా.. సినిమాపై అంచనాలు పెరిగాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

ఇప్పుడు ట్రైలర్ పై పెద్ద డిబేట్ పెట్టారు కొందరు హీరోల అభిమానులు. యూట్యూబ్ లో వస్తున్న వ్యూస్ బట్టి సినిమా రిజల్ట్ చెప్పేస్తున్నారు. అనవసరమైన విషయాలు ప్రస్తావిస్తున్నారు. లిమిట్స్ క్రాస్ చేసి మరీ కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఓ సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది.. మేకర్స్ ఇచ్చిన కంటెంట్ పై మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుందని చెబుతున్నారు.

సినిమా సూపర్ గా ఉన్నా.. బాలేదని చెబితే ఆడియన్స్ థియేటర్లకు వెళ్లకుండా ఆగిపోయే రోజులు కాదని గుర్తు చేస్తున్నారు. సినిమా బాగుంటే.. ఎవరు చెప్పినా చెప్పకపోయినా తరలివస్తారని అంటున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి అనేక చిత్రాలు.. స్టార్ హీరోలు నటిస్తే హిట్ అవ్వలేదని.. కంటెంట్ బాగుంది కాబట్టి బ్లాక్ బస్టర్లు అయ్యాయని చెబుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో అనవసరమైన వార్స్ వేస్ట్ అని సూచిస్తున్నారు.

అయితే ఆ వార్స్.. కేవలం ఫలానా ఆ హీరోల అభిమానుల మధ్యే జరుగుతుందని చెప్పలేం. ఎప్పటికప్పుడు అందరి హీరోల అభిమానుల మధ్య జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా సమయం వచ్చినప్పుడు.. తామంతా ఒకటేనని హీరోలు చెబుతున్నా.. ఫ్యాన్స్ మాత్రం ఏదో గొప్పగా ఫీలయ్యి మాటల యుద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇది ఎవరికీ.. ఎప్పటికీ మంచిది కాదని అంటున్నారు. ఖచ్చితంగా మారాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News